హన్సిక ఫోటో టాటూ వేయించుకున్న ప్రభుదేవా

ప్ర‌భుదేవా.. ఈ పేరంటే కేవ‌లం డాన్స‌ర్, డైరెక్ట‌ర్, యాక్ట‌ర్ మాత్ర‌మే కాదు.. ఓ రోమియో కూడా గుర్తొస్తాడు. అప్ప‌ట్లో ఆయ‌న చేసిన సినిమా మ‌హ‌త్య‌మో ఏమో కానీ ఇప్ప‌టికీ అదే మూడ్ లో ఉన్నాడు ప్ర‌భుదేవా. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుదేవా ఎవ‌రో ఓ హీరోయిన్ తో రిలేష‌న్ లో ఉన్నాడ‌నే వార్త‌లు వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఇప్పుడు హ‌న్సిక‌ను త‌న మ‌న‌సులో చేర్చుకున్నాడు ప్ర‌భు. ఆమె ఫోటోనే గుండెల‌పై ముద్ర వేయించాడు. కానీ ఇదంతా రియ‌ల్ లైఫ్ కోసం కాదు.. రీల్ లైఫ్ కోసం.

ప్రభుదేవా, హన్సిక ప్ర‌స్తుతం గులేబగవాళి అనే తమిళ సినిమాలో న‌టిస్తున్నారు. ఇందులో ఓ పాట కోసం వేసిన టాటూ ఇది. అంతకు మించి ఈ ఫొటోలో మ‌రో ముచ్చ‌టేమీ లేదు. కాక‌పోతే ఇటు హ‌న్సిక‌.. అటు ప్ర‌భుదేవా.. ఇద్ద‌రూ గ‌తంలో ఎఫైర్లు న‌డిపిన వాళ్లే. అందుకే ఇద్ద‌రి పేర్లు ఒకేసారి వినిపించే స‌రికి నిజ‌మే అనుకున్నారంతా. శింబు లాంటి హీరోతో పెళ్లి వ‌ర‌కు వెళ్లింది హ‌న్సిక వ్య‌వ‌హారం. ఇక ప్ర‌భుదేవా గురించి చెప్పేదేముంది.. ఈయ‌న నయనతారతో న‌డిపిన ప్రేమ వ్యవహారం గురించి అంద‌రికీ తెలిసిందే. అందుకే ఏ హీరోయిన్ తో క్లోజ్ గా ఉన్నా కూడా వెంట‌నే ప్ర‌భుదేవాకు లింక్ అంట‌గ‌ట్టేస్తుంటారు. ఇప్పుడు హ‌న్సిక ఇష్యూ కూడా ఇలా వ‌చ్చిందే..!