ఆకాష్ పూరికి బి-డే విషెస్‌

Last Updated on by

ఆంధ్రా పోరి, మెహ‌బూబా చిత్రాల‌తో హీరోగా త‌న‌ని తాను నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేశాడు ఆకాష్‌. న‌ట‌న త‌న‌కు కొత్తేమీ కాదు కాబ‌ట్టి, ఆ సినిమాల్లో ఎలాంటి టెన్ష‌న్ లేకుండా ఎంతో ఈజీగా చేసి చూపించాడు. అత‌డి డేరింగ్ యాటిట్యూడ్‌ని `మెహ‌బూబా` చిత్రంలో చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. సినిమా జ‌యాప‌జ‌యాల మాట ఎలా ఉన్నా ఆకాష్‌కి మాత్రం మంచి పేరొచ్చింది. పూరికి త‌గ్గ‌ట్టే సిస‌లైన వార‌సుడు అంటూ పొగిడేశారంతా.

అదంతా అటుంచితే నేడు ఆకాష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అత‌డికి బ‌ర్త్‌డే విషెస్‌తో సామాజిక మాధ్య‌మాలు హోరెత్తిపోతున్నాయి. యువ‌హీరోకి టాప్ సెల‌బ్రిటీలంతా శుభాకాంక్ష‌లు తెలిపారు. బుజ్జి ఆల్ ది బెస్ట్ ఫ‌ర్ ఫ్యూచ‌ర్ అంటూ బుజ్జిగాడు ప్ర‌భాస్ విష్ చేయ‌గా, బ‌ర్త్ డే బోయ్ .. హాయిగా తాగి ప‌డుకో! అంటూ ఫ‌న్నీగా విష్ చేశాడు నితిన్‌. ర‌వితేజ‌, నితిన్‌, అల్లు శిరీష్, సుకుమార్, సాయిధ‌ర‌మ్, అలీ, ద‌శ‌ర‌థ్‌, సిరాశ్రీ‌, సుబ్బ‌రాజు, కోన వెంక‌ట్‌, సుబ్బ‌రాజు, ప్రియ‌మ‌ణి, డ్యాన్స్ మాష్ట‌ర్లు, ఫైట్ మాస్ట‌ర్లు, ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్లు అంద‌రూ ఆకాష్‌కి బెస్ట్ విషెస్ అందించారు. అత‌డి భ‌విష్య‌త్ బావుండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకున్నారంతా. పూరి కొడుకు ఆకాష్ కాదు, ఆకాష్ తండ్రి పూరి అనేలా ఎద‌గాల‌ని అలీ ఆశీర్వ‌దించారు. ఇదిగో ఈ విజువ‌ల్ బైట్స్ వీక్షిస్తే మీకే అర్థ‌మ‌వుతుంది అస‌లు సంగ‌తి.

User Comments