బిడే బేబ్‌: ముక్కుసూటి ప‌ల్ల‌వి

Last Updated on by

సాయి ప‌ల్ల‌వి క్యారెక్ట‌ర్ యారొగెంట్‌…బాగా ముక్కోపి… త‌ల‌బిరుసు.. ఇవీ ఆరంభంలో ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు ఇచ్చిన బిరుదులు. ప్ర‌తిభ ఎంత దాగి ఉందో, త‌ల‌తిక్క అంతే ఇదిగా ఉంది అంటూ నాలుక‌లు కొరుక్కున్నారు. అయితే వెన‌క నుంచి ఎన్ని ర‌కాల గుస‌గుస‌లు వినిపించినా ఈ అమ్మ‌డి తీరు మాత్రం మార‌లేదు. తాను అనుకున్న‌ది ముక్కుసూటిగానే చెప్పేస్తోంది. అగ్ర‌నిర్మాత దిల్‌రాజుతో విభేధాల్లోనూ సాయి ప‌ల్ల‌వి అంతే ఇదిగా ప్ర‌వ‌ర్తించింద‌న్న మాటా అప్ప‌ట్లో వినిపించింది. అయితే అవ‌న్నీ ప్ర‌తిభ ముందు ఫిదా అయిపోయాయ్‌. ఫిదా సినిమా త‌ర‌వాత సాయి ప‌ల్ల‌వి ఎదురే లేని రీతిలో ఎదిగేసింది. ఇప్ప‌టికిప్పుడు మూడు సినిమాల్లో న‌టిస్తోంది.

సాయిప‌ల్ల‌వి చ‌క్క‌ని భ‌విష్య‌త్ లైన‌ప్ కుదిరింది. ట్యాలెంటెడ్ హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్న `పడి ప‌డి లేచే` చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శ‌ర్వానంద్ ఈ మూవీ క‌థానాయ‌కుడు. తాజా పోస్ట‌ర్ చూస్తుంటే, అందులో సాయి ప‌ల్ల‌వి సంథింగ్ అని అర్థ‌మ‌వుతోంది. సూర్య-సెల్వ‌రాఘ‌వ‌న్‌ `ఎన్‌జీకే`లో నాయిక‌గా న‌టిస్తూ టాప్ లెవ‌ల్‌కి వెళ్లిపోయింది త‌మిళ్‌లో. మ‌రో త‌మిళ సూప‌ర్‌స్టార్ ధ‌నుష్ న‌టిస్తున్న `మారి 2`లోనూ నాయిక‌గా న‌టిస్తోంది. నేడు ఈ భామ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా మై ఫ‌స్ట్ షో శుభాకాంక్ష‌లు.

User Comments