టాప్ స్టోరి: స‌మంత ది గ్రేట్

Last Updated on by

అందం, ప్ర‌తిభ వీటికి తోడు ల‌క్ క‌లిసొస్తే ఎలా ఉంటుందో అందుకు ఘ‌న‌మైన ఎగ్జాంపుల్ స‌మంత‌. `ఏ మాయ చేశావే` సినిమాతో జెస్సీగా ప‌రిచ‌య‌మైన సామ్‌ ఇంతింతై వ‌టుడింతై అన్న చందంగా ఎదిగిన తీరు అద్భుతం. టాలీవుడ్ టాప్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించిన సామ్‌, అటు కోలీవుడ్‌లోనూ తిరుగులేని హ‌వా సాగించింది. సీనియ‌ర్లు, జూనియ‌ర్లు అనే తేడా లేకుండా అందివ‌చ్చిన అవ‌కాశాన్ని అందిపుచ్చుకోవ‌డంలో మేటి అని నిరూపించుకుంది. స‌క్సెస్‌ల కంటే స‌వాళ్ల‌ను తెలివిగా ఎదుర్కోవ‌డంలో గ్రేట్‌ అన్న పేరు తెచ్చుకున్న సామ్ .. స్టార్‌డ‌మ్‌ని కొన‌సాగించ‌డానికి ప్రామాణిక‌త‌గా ఎదిగిందంటే అతిశ‌యోక్తి కాదు.

ఇటీవ‌లే అక్కినేని కోడ‌లుగా, చైత‌న్య వైఫ్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించిన సామ్ .. పెళ్లి త‌ర‌వాత కెరీర్‌కి డోఖా లేకుండా ప్లాన్ చేసుకోవ‌డం చూస్తుంటే ఎంత గ‌డుస‌రి కోడ‌లో అర్థం చేసుకోవ‌చ్చు. సామ్‌ వృత్తిగ‌త‌, వ్య‌క్తిగ‌త జీవితాల్ని స‌మ‌న్వ‌యం చేసుకుంటూ జైత్ర‌యాత్ర‌ను సాగిస్తున్న తీరును మెచ్చుకుని తీరాలి. హైద‌రాబాద్‌- చెన్న‌య్ సంగ‌మంలో స‌మంత ఇరు ప‌రిశ్ర‌మ‌ల్లోనూ సినిమాలు చేస్తూ అసాధార‌ణ సంపాద‌న‌తో దూసుకెళుతోంది. ఇప్ప‌టికిప్పుడు స‌మంత న‌టించిన రెండు సినిమాలు రిలీజ్ బ‌రిలో ఉన్నాయి. మ‌హాన‌టి, అభిమ‌న్యుడు కేవ‌లం రెండ్రోజుల తేడాతో రిలీజ‌వుతున్నాయి. మే 9, మే 11 సామ్‌కి బిగ్ డేస్‌. అలానే ప‌లు చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. యూట‌ర్న్ రీమేక్ స‌హా హ‌బ్బీ చైత‌న్య స‌ర‌స‌న వేరొక చిత్రంలో న‌టిస్తోంది. ఇలాంటి ఆస‌క్తిక‌ర ప‌య‌నం, స‌క్సెస్‌ఫుల్ లైఫ్‌ అంద‌రికీ సాధ్యం కాదు. అందుకే స‌మంత ది గ్రేట్… ది బెస్ట్‌. నేడు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా `మై ఫ‌స్ట్ షో` త‌ర‌పున బి-డే శుభాకాంక్ష‌లు.

User Comments