ప‌దేళ్ల‌లో నాలుగే నాలుగు?

Last Updated on by

టాలీవుడ్‌లో స్టార్ డైరెక్ట‌ర్ హోదాని ఎంజాయ్ చేస్తున్న వంశీ పైడిప‌ల్లి ప‌దేళ్ల కెరీర్‌లో తీసింది నాలుగే నాలుగు సినిమాలు. ఓ క‌న్న‌డ సినిమాని తెర‌కెక్కించారు. ఓ ద‌ర్శ‌కుడు అంత ఓపిగ్గా, ఎంతో వేచి చూసి క‌మిట్‌మెంట్‌తో హిట్టు మాత్ర‌మే తీయాలి… స్టార్ హీరోతో మాత్ర‌మే సినిమా తీయాలి… అని ఎదురు చూడ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచేదే. అందువ‌ల్ల‌నే ద‌శాబ్ధం కెరీర్‌లో ఇంత స్లోఫేస్‌తో కెరీర్‌ని సాగించాడు వంశీ. అంతేకాదు ఈ ప‌దేళ్ల‌లో ఓ స్టార్ హీరో కోసం రెండేళ్లు పైగానే వేచి చూశాడు.

ప్ర‌భాస్‌తో మున్నా(2007), రామ్‌చ‌ర‌ణ్‌తో ఎవ‌డు, ఎన్టీఆర్‌తో బృందావ‌నం, నాగార్జున‌- కార్తీల‌తో ఊపిరి వంటి చిత్రాల్ని తెర‌కెక్కించాడు. మున్నా యావ‌రేజ్ అయినా మిగ‌తా మూడు చిత్రాలు బ్లాక్‌బ‌స్ట‌ర్లే. అంత ట్రాక్ రికార్డ్ ఉండీ, వంశీ ఎందుకిలా నెమ్మ‌దిగా కెరీర్‌ని సాగిస్తున్నాడో ఎవ‌రికీ అంతుచిక్క‌నిది. ప్ర‌స్తుతం మ‌హేష్‌- న‌రేష్‌ల‌తో మ‌ల్టీస్టార‌ర్ తీస్తున్నాడు. ఈ సినిమా కోసం అత‌డు ఇప్ప‌టికే రెండేళ్లు పైగానే వేచి చూశాడు.. అది ఫ‌లించింది.. బ్లాక్‌బ‌స్ట‌ర్లు తీసిన వంశీకి మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌డాల్సిన స‌న్నివేశం ఉందిప్పుడు. ఇక మ‌హేష్‌ని రైతుగా చూపిస్తున్న ఘ‌న‌త‌ను వంశీ ద‌క్కించుకున్నాడు. ఇక భ‌ర‌త్ అనే నేను చిత్రంలో ముఖ్య‌మంత్రిగా క‌నిపించిన మ‌హేష్‌ని ఆ వెంట‌నే రైతుగా చూపించాల‌న్న సాహ‌సం ఎంత‌వ‌ర‌కూ స‌ఫ‌లీకృతం అవుతుందో వేచి చూడాలి.

User Comments