హ‌రీష్ ఆవేద‌న‌కు కార‌ణం

Last Updated on by

మెగా డైరెక్ట‌ర్, `గ‌బ్బ‌ర్‌సింగ్` ఫేం హ‌రీష్ శంక‌ర్‌కి ఇటీవ‌లి కాలంలో బ్యాడ్‌టైమ్ ర‌న్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అందివ‌చ్చిన అవ‌కాశం సైతం ఇంకా పెండింగులోనే ఉండిపోయింది. ఇది అత‌డిలో అంత‌కంత‌కు నైరాశ్యాన్నే మిగులుస్తోంది. నిన్న‌టికి నిన్న నిర్మాత దిల్ రాజు త‌న సినిమాల లిస్ట్ అంతా చెప్పి, ఫ‌లానా సినిమా ఫలానా తేదీకి రిలీజ‌వుతుంది అంటూ పూస‌గుచ్చి మ‌రీ చెప్పారు. రాజ్‌త‌రుణ్‌, నితిన్‌, వెంకీ -వ‌రుణ్‌తేజ్‌, మ‌హేష్ సినిమాల రిలీజ్ తేదీల్ని ఆయ‌న లాక్ చేసేశారు. ప‌రోక్షంగా హ‌రీష్‌తో సినిమా ఇప్ప‌ట్లో లేద‌ని తేల్చేశారు.

ఆ క్ర‌మంలోనే దిల్‌రాజు లిస్ట్‌లోంచి మిస్స‌య్యానే.. అరెరే….అంటూ హ‌రీష్ నిర్వేదం వ్య‌క్తం చేశాడు. “జాబితా నుంచి నా సినిమా మిస్స‌యింది. వీర్డ్‌గా ఫీల‌వుతున్నా. కానీ కొన్నిసార్లు కొన్ని త‌ప్ప‌వు. ఆ ఐదు సినిమాల‌కు నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు“ అంటూ హ‌రీష్ ట్వీట్ చేశాడు. దీన్నిబ‌ట్టి పాపం అత‌డిలో ఆవేద‌న అర్థం చేసుకోవ‌చ్చు. హ‌రీష్ – దిల్‌రాజు `దాగుడు మూత‌లు` సెట్స్‌కెళితేనే దీనికి విరుగుడు దొరికిన‌ట్టు.

User Comments