హేట్ బ్యూటీ.. మ‌హిళ‌ల‌కు స్ఫూర్తి!

Last Updated on by

అందాల ఆర‌బోత‌కు ఏమాత్రం అడ్డుచెప్ప‌ని బాలీవుడ్ సోయ‌గం ఊర్వ‌శి రౌతేలా. హేట్ స్టోరి 4 చిత్రంతో బాలీవుడ్ ని అట్టుడికించింది. తొలుత టీవీ రంగంలో త‌న‌వైన అంద‌చందాల‌తో దూసుకుపోయిన ఈ హాటీ.. అటుపై పెద్ద తెర‌పైనా తొలి ప్ర‌య‌త్న‌మే వేడెక్కించింది. అంద‌మైన‌ అమ్మాయితో ఆడుకునే బ్ర‌ద‌ర్స్ గేమ్ కి ఊర్వ‌శి ఇచ్చే అస‌లు సిస‌లు ట్విస్టు ఏంటి? అనేది హేట్ స్టోరి 4లో చూపించారు. న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లో ఊర్వ‌శి అద్భుతంగా న‌టించింది. ప్ర‌స్తుతం సింహ‌బ‌లుడు జాన్ అబ్ర‌హాం స‌ర‌స‌న పాగ‌ల్ పాంటీ అనే సినిమాలో న‌టిస్తూ వేడెక్కిస్తోంది. ఈ చిత్రానికి ప్ర‌ఖ్యాత అనీష్ భ‌జ్మి ద‌ర్శ‌క‌త్వ ం వ‌హిస్తున్నారు. దాదాపు 100కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో త‌న‌కు ఛాన్స్ ద‌క్కినందుకు ఊర్వ‌శి ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది.

నేడు మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భ ంగా ఊర్వ‌శి ఓ ఆస‌క్తిక‌ర వీడియోని ఇన్‌స్టాగ్ర‌మ్‌లో షేర్ చేశారు. 2018 హిట్ మూవీ `హేట్ స్టోరి 4` చిత్రం నుంచి ఓ వీడియో క్లిప్ ని అభిమానుల‌కు షేర్ చేశారు. మ‌హిళ‌లు ప్ర‌కాశ‌వంతంగా మారుతున్నారు. హ్యాపీ ఉమెన్స్ డే 2019 అంటూ కామెంట్ ని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్టు కూడా ఉంది. త‌న లైఫ్ తో ఆడుకోవాల‌నుకున్న ఒక యువ‌కుడిని హ‌త్య చేసి .. ఆ హ‌త్య‌ను అత‌డి సోద‌రుడిపైకి నెట్టేస్తుంది. ఊర్వ‌శి ఇచ్చిన ఈ ట్విస్టు మామూలుగా లేదంటూ తాజా వీడియో పోస్ట్‌ పై అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఈ వీడియోకి ఓ అభిమాని ఆస‌క్తిక‌ర కామెంట్ ని పోస్ట్ చేశాడు. మీలో బాండ్ గాళ్ క‌నిపిస్తోంది! అంటూ ట్వీట్ చేస్తే.. ఐ ల‌వ్ హేట్ స్టోరీస్ అంటూ వేరొక అభిమాని వ్యాఖ్య‌ను పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం పాగ‌ల్ పాంటీ సినిమాతో పాటుగా వేరొక సినిమాలోనూ ఊర్వ‌శి న‌టిస్తోంది. ఈ రెండు సినిమాలు ఈ అమ్మ‌డి భ‌విష్య‌త్ ని నిర్ణ‌యిస్తాయ‌న‌డంలో సందేహం లేదు.

User Comments