యాంక‌ర్‌ని రిసార్టుకు ర‌మ్మ‌న్నాడు!

ప‌రిశ్ర‌మ‌లో బోలెడ‌న్ని వింత‌లు విచిత్రాలు.. మ‌న‌కు తెలియ‌నివి ఎన్నో. ఇక్క‌డ మేక‌వ‌న్నె పులుల గురించి తెలుసుకున్న‌వారికి తెలుసుకున్నంత‌. ముఖ్యంగా మీటూ అంటూ ఆన్ లైన్ వేదిక‌గా జ‌రిగిన ర‌చ్చ‌కు.. ఎవ‌రూ భ‌య‌ప‌డిన‌ట్టే లేదు. టాలీవుడ్ లో కాష్ క‌మిటీ ప‌ని చేస్తున్నా కొంద‌రు పురుష‌పుంగ‌వులు అస్స‌లు దీనికి భ‌య‌ప‌డ‌డం లేదు.

తాజాగా ఓ రేడియో యాంక‌ర్ తో ఓ సీనియ‌ర్ న‌టుడు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించినా చెప్పుకునే నాధుడే లేడు అన్న ఆవేద‌న క‌నిపిస్తోంది. నా జీవిత చ‌రిత్ర‌ను మీరే రాయాలి.. ఏదైనా రిసార్ట్ కి వెళ్లి మూడు రోజులు ప్ర‌శాంతంగా రాసుకుందాం! అంటూ త‌న‌కు ఆఫ‌ర్ చేశాడ‌ట‌. అది మీరే రాయాలి! అంటూ గారాలు పోయాడ‌ట‌. ఇంత‌కీ ఆయ‌నెవ‌రు? అన్న‌ది అటుంచితే అస‌లు అందులో అంత‌రార్థం అర్థం చేసుకోలేనంత ప‌సిపిల్ల కాదు క‌దా! అయితే దానిని ఎవ‌రికీ చెప్పుకోలేక స‌ద‌రు యాంక‌ర్ పిల్ల స‌న్నిహితుల‌కు చెప్పుకుని వాపోయింద‌ట‌. ఇంత‌కీ ఎవ‌రా సీనియ‌ర్ అంటే.. మూడు ద‌శాబ్ధాల పాటు ఏలిన అత‌డు .. ఇప్ప‌టికీ ఫామ్ లోనే ఉన్నాడు మ‌రి. ఆయ‌న జీవితంలో అంతుందా? అంటే స్ట‌ఫ్ చాలా ఉంద‌ని త‌న‌కు తానే సెల్ఫ్ డ‌బ్బా కొట్టుకున్నాడ‌ట స‌ద‌రు యాంక‌ర్ వ‌ద్ద‌.