నాటీ గాయ‌నిని వెంబ‌డిస్తున్నాడ‌ట‌

వేడెక్కించే అందం.. అంత‌కుమించి క‌వ్వించే స్వ‌రం ఉన్న హాట్ సింగ‌ర్ కం న‌టి ఆమె. హ‌స్కీ వాయిస్ తో కుర్రాళ్ల గుండెల్లో బుల్లెట్లు దించేస్తుంది. అప్ప‌ట్లో ఓ కొలీగ్ తో రాస‌లీల వ్య‌వ‌హారంలో వేరొక లేడీ కొలీగ్ లీక్ చేసిన వీడియోల్లో ప్ర‌ముఖంగా ఆ గాయ‌ని క‌నిపించింది. మీడియాలో చాలా కాలం ఆ పేరు పాపుల‌రైంది. క‌ట్ చేస్తే ఆ త‌ర్వాత మ‌ళ్లీ ప‌రిస్థితి సెట్ రైట్ అయ్యింది అనుకుంటుండ‌గా.. స‌ద‌రు గాయ‌ని వ్య‌క్తిగ‌త జీవితంలో క‌ల్లోలం ఎదురైంది. ఓ పెళ్ల‌యిన డైరెక్ట‌ర్ తో స‌హ‌జీవ‌నం చేసిన పాపానికి అటుపై తీవ్ర‌మైన డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత డిప్రెష‌న్ కి ర‌క‌ర‌కాల మందులు వాడటంతో కెరీర్ కి బిగ్ బ్రేక్ వ‌చ్చింది. ఓవైపు పాట‌లు పాడ‌లేదు.. మ‌రోవైపు న‌ట‌న‌కు ఓకే చెప్ప‌లేదు. అలా కెరీర్ నాశ‌న‌మైంది. అయితే తిరిగి అన్నిర‌కాలుగా డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డినా కానీ ఇప్పుడు అస‌లే అవ‌కాశాల్లేవ్.

స‌రిగ్గా ఇలాంటి టైమ్ లో స‌ద‌రు పెళ్ల‌యిన ద‌ర్శ‌కుడితో ల‌వ్ ఎఫైర్ గురించి చెబుతూ రియ‌లైజ్ అయ్యాన‌ని చెబుతోంది. అత‌డో శాడిస్ట్ అని తెలిసీ ప్రేమించాన‌ని దాని నుంచి ఇప్పుడు రియ‌లైజ్ అయ్యాన‌ని చెబుతోంది. ఓవైపు తెలిసీ త‌ప్పు చేసిన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం ఓ బుక్ రాసింద‌ట‌. అందులో స‌ద‌రు పెళ్ల‌యిన డైరెక్ట‌ర్ పేరు రివీల్ చేస్తున్నానంటూ బెదిరిస్తోంది. దీంతో అట్నుంచి కూడా త‌న‌ని బెదిరిస్తూ ఒక రాజ‌కీయ నాయ‌కుడు కం న‌టుడు ఫోన్ చేస్తున్నాడ‌ట‌. ఇంత‌కీ ఆయ‌నెవ‌రు? అంటే జ‌స్ట్ క్లూ ఇస్తోంది అంతే. ఆయ‌న వ‌ల్ల త‌నకు ప్ర‌మాదం ఉంద‌ని చెబుతోంది. ఇంత‌కీ బుక్ రిలీజ్ ఎప్పుడు? అని అడిగితే అస‌లు స‌మాధనం లేదు. అస‌లింత‌కీ ఎవ‌రా గాయ‌ని! అంటూ టాలీవుడ్ లో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కీ ఎవ‌రా హాట్ కిల్ల‌ర్ గాయ‌నీమ‌ణి?