హాస్య‌బ్ర‌హ్మీ గుండెకు చికిత్స‌

1000 సినిమాల రారాజు.. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం హార్ట్ అటాక్ కి గుర‌య్యారు. ఆయ‌న‌కు ముంబై లో బైపాస్ స‌ర్జ‌రీ విజ‌య‌వంతంగా చేశార‌ని తెలుస్తోంది. ప్రస్తుతం బ్ర‌హ్మీ ఆరోగ్యం నిలకడగా ఉంద‌ని, అభిమానులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని కుటుంబ సభ్యులు వెల్ల‌డించారు. కొన్ని వారాల పాటు బ్రహ్మానందం విశ్రాంతి తీసుకోవాల్సి ఉందిట‌.

ప్ర‌పంచంలోనే అరుదైన రికార్డుల‌కు అర్హ‌మైన‌ ఏకైక ట్యాలెంటు.. టాప్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం మాత్ర‌మే. జీవితాంతం న‌టుడిగా ఆయ‌న టాలీవుడ్ కి సేవ‌లందించారు. అత‌డి ప్ర‌తిభ‌ను స‌రైన ప‌ద్ధ‌తిలో వినియోగించుకోగ‌లిగే ద‌ర్శ‌కులు లేక‌పోవ‌డ‌మే ఓ ర‌కంగా సినిమాలు త‌గ్గించ‌డానికి కార‌ణ‌మ‌ని చెబుతుంటారు. ఈ విష‌యంలో రొటీన్ డైరెక్ట‌ర్ల‌పై బ్ర‌హ్మీ త‌న‌దైన సెటైర్లు వేసిన సంగ‌తిని గుర్తు చేసుకోవాలి. ఇక‌పోతే ఇటీవ‌ల బ్ర‌హ్మీ బుల్లితెర కార్య‌క్ర‌మాల‌కు హోస్టింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.