హైద‌రాబాద్ లో భారీ వ‌ర్షం..జాగ్ర‌త్త‌

కొన్ని రోజులుగా హైద‌రాబాద్ లో  భారీ వర్షాలు కురుస్తోన్న సంగ‌తి తెలిసిందే . ఇంకా వరద నీరు వీధుల్లో పారుతూనే ఉంది. ఈ క్రమంలో నగర సీపీ అంజనీకుమార్ మరో షాకింగ్ విషయం చెప్పారు. హైదరాబాద్‌కు నేడు భారీ వర్ష సూచన ఉందని సీపీ ఓ ప్రకటనలో తెలిపారు. బయటి ప్రాంతాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉన్నారని, వర్షం కారణంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే డయల్ 100కు ఫోన్ చేయాలని సీపీ సూచించారు.ఇదిలా ఉంటే ఉత్తరాదిని వానలు ముంచెత్తనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఉత్తరప్రదేశ్‌లో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 73 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూపీలోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది.