కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్షాలు

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్ర‌భావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు మరో మూడు రోజులు భారీ వర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని తెలుస్తోంది. ఈ జిల్లాలలో 18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం చిత్తూరు కడప కర్నూలు అనంతపురం జిలాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ భారీ వర్షాలు కురిసే సూచనలు క‌నిపిస్తున్నాయి. ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి.

ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వాతావరణ నిపుణులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఆ మేర‌కు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్), సచివాలయం, అమరావతి నుంచి ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.