హెబ్బా .. 24 కిస్సులు

Last Updated on by

హెబ్బా ప‌టేల్ పేరు విన‌గానే `కుమారి 21ఎఫ్` గుర్తుకొస్తుంది. ఈ భామ కెరీర్ వెనుదిరిగి చూసుకోనంత‌గా దూసుకెళ్ల‌డానికి ఆ సినిమానే కార‌ణం. కెరీర్‌లో కొన్ని హిట్లు ఉన్నా, ఇటీవ‌లి కాలంలో ప‌లు చిత్రాలు ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వేల‌దు. అయితేనేం.. కొంత గ్యాప్ త‌ర్వాత ఈ భామ న‌టించిన ఓ సినిమాకి అద్భుత‌మైన ప‌బ్లిసిటీ వ‌చ్చేస్తోంది. ఈ సినిమాకి టైటిల్ `24 కిస్సెస్‌`. టైటిల్‌కి త‌గ్గ‌ట్టే ఇదో ప్రేమ‌క‌థా చిత్ర‌మ‌ని పోస్ట‌ర్ చెబుతోంది. ఇందులో ఆదిత్ అరుణ్‌ క‌థానాయ‌కుడు.

ఇదంతా ఒకెత్తు అనుకుంటే, ఈ సినిమాకి `మిణుగురులు` ఫేం అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం మ‌రో ఎత్తు. `మిణుగురులు` సామాజిక బాధ్య‌త‌తో కూడుకున్న సందేశాత్మ‌క చిత్రం. కానీ ఇప్పుడు అత‌డు పూర్తి ఆపోజిట్ సినిమా తీస్తుండ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ప్రేమ‌క‌థ‌లు, ముద్దులాట‌లు, రొమాన్స్ లేక‌పోతే సినిమాలు ఆడ‌వ‌ని ఆయ‌న భావించారా? తొలి సినిమా `మిణుగురులు` గొప్ప క్లాసిక్ అంటూ పేరు తెచ్చినా, అణాపైసా కూడా తిరిగి రాలేదు పాపం. ఒక నంది అవార్డు అందుకున్న మిణుగురులు విదేశీ కేట‌గిరీ విభాగంలో ఆస్కార్‌ నామినేష‌న్‌కి పంపించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఎందుక‌నో రేసులో నిల‌బ‌డ‌లేదు. ఏదైతేనేం.. అంత గొప్ప ద‌ర్శ‌కుడు ఇప్పుడిలా రూటు మార్చి క‌మ‌ర్షియ‌ల్ దారి వెతుక్కోవ‌డం వింతైనదే.

User Comments