బిగ్‌బాస్‌కు హెబ్బా నోనో

Last Updated on by

ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్‌లో డ‌ర్టీపిక్చ‌ర్ సిరీస్ ర‌న్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి వేళ ఒక హీరోయిన్ అస‌లు నేను ఏ కొంప‌(ఇల్లు) లోకి దూర‌ను.. అనే అర్థం వ‌చ్చేలా మాట్లాడింది. అస‌లింత‌కీ ఎవ‌రా భామ‌? అంటే.. ఇంకెవ‌రు? `కుమారి 21ఎఫ్` ఫేం హెబ్బా ప‌టేల్‌. ఈ అమ్మ‌డు నేచుర‌ల్‌స్టార్ నాని హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. హెబ్బాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంద‌ని చెప్పుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్‌కి ప‌ని చేసే ఓ టెక్నీషియ‌న్ ఈ వార్త‌ను స్ప్రెడ్ చేయ‌డంపైనా స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది.

అదంతా అటుంచితే, ఈ రూమ‌ర్ల‌పై హెబ్బా స్పందించింది. ఇదంతా త‌ప్పుడు ప్ర‌చారం అంటూ ఖండించింది. “నేను ఓన్లీ మా ఇంట్లోనే ఉన్నా. ఏ ఇంట్లోకి వెళ్లే ఆలోచ‌న లేదు. నేను ఎలాంటి రియాలిటీ షోలు చేయ‌డం లేదు“ అంటూ రూమ‌ర్ల‌కు చెక్ పెట్టింది. హెబ్బా న‌టించిన 24 కిస్సెస్ సెన్సేష‌న్స్‌కి రెడీ అవుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. పోస్ట‌ర్ల‌కు ఇప్ప‌టికే చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

User Comments