ప్రేమ‌లో ప‌డిన హీరో రామ్

Last Updated on by

రామ్ మ‌రోసారి ప్రేమ‌లో ప‌డిపోయాడు. రెండేళ్ల కింద నేను శైల‌జ అంటూ ప్రేమ‌క‌థ న‌డిపించిన ఈ కుర్ర హీరో.. మ‌ధ్య‌లో హైప‌ర్ అంటూ యాక్ష‌న్ మూవీ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఈ చిత్రం ఫ్లాప్ అయ్యేస‌రికి.. మ‌ళ్లీ రూట్ మార్చి స్నేహం కోసం అన్నాడు. ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ అని చెప్పినా ప్రేక్ష‌కులు మాత్రం ప‌ట్టించుకోలేదు. దాంతో ఇప్పుడు మ‌ళ్లీ ప్రేమ‌క‌థ వైపు అడుగేస్తున్నాడు ఈ కుర్ర‌హీరో. ఈ సారి మాత్రం ప‌క్కా మాస్ ప్రేమ‌క‌థ‌తో వ‌స్తున్నాడు ఈ ఎన‌ర్జిటిక్ స్టార్.

హ‌లో గురు ప్రేమ‌కోస‌మే అంటూ నాగార్జున పాడిన పాట‌నే ఇప్పుడు త‌న సినిమాకు టైటిల్ గా పెట్టుకున్న రామ్.. ఆ ఫ‌స్ట్ లుక్ తో మ‌న ముందుకు వ‌చ్చేసాడు. మీసాలు మాత్ర‌మే పెట్టి.. గ‌డ్డం లైట్ గా తీసి.. ర‌ఫ్ లుక్ లోకి మారిపోయాడు రామ్. కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత స్మార్ట్ గా ఎప్పుడూ లేడు ఈ హీరో. త్రినాథ‌రావ్ న‌క్కిన తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ త‌ర్వాత మ‌రోసారి ఈ జోడీ రొమాన్స్ చేస్తున్నారు. మే 15న రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. మ‌రి చూడాలి.. వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న రామ్ ఈ చిత్రంతోనైనా గాడిన ప‌డ‌తాడో లేదో..?

User Comments