హ‌లో గురు ప్రేమ‌కోస‌మే సీన్ లీక్

Last Updated on by

ఈ రోజుల్లో లీకేజ్ అతిపెద్ద స‌మ‌స్య‌గా మారిపోయింది. ఎక్క‌డ షూటింగ్ చేసినా కూడా ఎంత జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఏదో ఓ విధంగా సీన్స్ లీకవుతూ వ‌స్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. రామ్ హీరోగా త్రినాథ‌రావ్ న‌క్కిన తెర‌కెక్కిస్తోన్న సినిమా హ‌లో గురు ప్రేమ‌కోస‌మే. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే స‌గానికి పైగా షూటింగ్ పూర్త‌యింది కూడా. ప్ర‌స్తుతం వైజాగ్ లో హ‌లో గురు ప్రేమ‌కోస‌మే క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. అక్క‌డ ఓ కాలేజ్ ద‌గ్గ‌ర సీన్ షూట్ చేస్తుండ‌గా ఎవ‌రో ఫోన్ లో వీడియో తీసి నెట్ లో వీడియో పెట్టేసారు.

రామ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సీన్ ను ఫోన్ లో బంధించేసారు. ఈ సీన్ లో రామ్ ను అనుప‌మ కౌగిలించుకుంటుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ లో విడుద‌ల కానుంది. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. చాలా రోజుల త‌ర్వాత ప్ర‌ణీత ఈ చిత్రంతో తెలుగులోకి వ‌స్తుంది. వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న రామ్.. అనుప‌మ‌కు ఈ చిత్ర ఫ‌లితం కీల‌కంగా మారింది.

User Comments