హ‌లో గురూ నైజాంలో హ‌వా

Last Updated on by

రామ్- అనుప‌మ జంట‌గా త్రినాధ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మించిన `హ‌లో గురు ప్రేమ కోస‌మే` ఈ గురువారం రిలీజైన సంగ‌తి తెలిసిందే. మిశ్ర‌మ స్పంద‌నల మ‌ధ్య ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్స్ డ‌ల్‌గా ఉన్నా… నైజాంలో మాత్రం చ‌క్క‌ని వ‌సూళ్లు సాధిస్తోందని ట్రేడ్ చెబుతోంది.

తాజా స‌మాచారం ప్రకారం.. నైజాంలో మొదటి రోజు 1.4 కోట్ల షేర్, రెండో రోజున 1.35 కోట్ల షేర్ వ‌సూలు చేసింద‌ని తెలుస్తోంది. ఈ శ‌ని, ఆదివారాలు వ‌సూళ్లు పెరిగే ఛాన్సుంది. రామ్- అనుప‌మ జంట న‌ట‌న‌కు పేరొచ్చింది. ల‌వ్‌స్టోరిలో ప్ర‌కాష్‌రాజ్ పాత్ర ఆక‌ట్టుకుంది. దేవీశ్రీ రీరికార్డింగ్ ప్ల‌స్ అన్న టాక్ వినిపించింది. అలాగే ఓవ‌ర్సీస్ ప్రీమియ‌ర్ల నుంచి 70కె డాల‌ర్లు వ‌సూలు చేసింద‌ని ఇదివ‌ర‌కూ రిపోర్ట్ అందింది. తెలుగు రాష్ట్రాల్లో ద‌స‌రా సెల‌వులు ఈ సినిమాకి క‌లిసొచ్చాయి. అయితే సోమ‌వారం నుంచి రిపోర్ట్ ఏంటో చూడాలి.

User Comments