`మ‌హాన‌టి` విన్యాసాలు

Last Updated on by

….`మాయాబ‌జార్‌`లోని నాటి మేటి క్లాసిక్ సాంగ్‌కి అందాల స‌మంత ఎక్స్‌ప్రెష‌న్స్ చూశారా? గుండె జిల్‌మ‌న‌డం లేదూ? అయితే యూత్‌కి ఎంత జిల్‌మ‌ని అనిపించినా.. సావిత్రి రేంజులో స‌మంత అభిన‌యించింది అని ఎవ‌రూ అంగీక‌రించ‌రు. సావిత్రి అభిమానులు అయితే మ‌హా క‌ష్టం. మీన‌నేత్రాల సావిత్రి .. కాటుక క‌నుల సావిత్రి నాటి మేటి క్లాసిక్ సినిమా `మాయాబ‌జార్‌`లో ప్ర‌దర్శించిన న‌ట‌నాభిన‌యం అన‌న్య‌సామాన్య‌మైన‌ది. క‌నుసైగ‌ల‌తోనే నాటి యువ‌త గుండెల్లో మ‌హాప్ర‌ళ‌యం సృష్టించ‌గ‌లిగిన మేటి నాయిక సావిత్రి. పెళ్లి వేడుక ఘ‌ట్టంలో ఘ‌టోత్క‌చుడు ఆవహించిన రాకుమారిగా సావిత్రి అభిన‌యాన్ని అంత తేలిగ్గా మ‌ర్చిపోగ‌ల‌మా?

అందుకే తాను అంత గొప్ప‌గా అభిన‌యించ‌లేన‌ని నేటిత‌రం నాయిక స‌మంత నిజాయితీగా అంగీక‌రించింది. `మాయాబ‌జార్‌` లోని ఆల్‌టైమ్‌ క్లాసిక్ సాంగ్‌కు అందాల స‌మంత అభిన‌యించాల‌ని ప్ర‌య‌త్నించినా అస్స‌లు కుద‌ర‌లేదు. అయితే ఇదంతా ఓ స్మార్ట్‌ఫోన్‌ని చేతిలో ప‌ట్టుకుని అలా స‌ర‌దాకి చేసినది మాత్ర‌మే. అంతేనా సామ్ ఆ వీడియోలో ఏమందంటే.. “అబ్బో ఇది(సావిత్రిలా) చాలా క‌ష్టం… ఊరికినే మ‌హాన‌టిగారంటారా? “ అంటూ ప్ర‌శ్నించింది. ఇలాంటి ఫ‌న్నీ వీడియోల్ని పంపిస్తే స్పెష‌ల్ గిఫ్ట్ ఇస్తానంటూ ఊరించింది సామ్‌. `మ‌హాన‌టి` మే 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న `మ‌హాన‌టి` ప్ర‌మోష‌న్‌లో భాగంగా సామ్ ఇలా టీజ్ చేసింది. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర‌లో కీర్తి న‌టించ‌గా, జ‌ర్న‌లిస్టుగా స‌మంత న‌టించిన సంగ‌తి తెలిసిందే.

User Comments