సీసీసీకి హీరో గోపీచంద్ రూ. 10 ల‌క్ష‌ల విరాళం

టాలీవుడ్ హీరోల్లో గోపీచంద్ మ‌రోసారి త‌న గొప్ప మ‌న‌సును, విత‌ర‌ణ‌ను చూపించారు. ఇప్ప‌టికే లాక్‌డౌన్ కార‌ణంగా క‌ష్టాలు ప‌డుతున్న‌ రెండు వేల కుటుంబాల‌కు నిత్యావ‌ర వ‌స్తువుల‌ను అంద‌జేసిన ఆయ‌న‌, తాజాగా చిరంజీవి ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోన్న క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి రూ. 10 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో ఉపాధి లేక ఇబ్బందులు ప‌డుతున్న దిన‌స‌రి వేత‌న కార్మికుల‌ను ఆదుకోవ‌డానికి త‌న వంతు చేయూత‌ను అందించ‌డానికి ఆయ‌న ముందుకు వ‌చ్చారు. గోపీచంద్ విత‌ర‌ణ ఇంత‌టితో ఆగ‌లేదు. రోజూ 1500 మంది అనాథ‌ల‌కు రెండు నెల‌ల పాటు ఆయ‌న అన్న‌దానం చేస్తుండ‌టం విశేషం.