ద‌ర్శ‌కుడిని పెళ్లాడిన హీరో

Last Updated on by

మా సినిమా ఆడుతున్న థియేట‌ర్ల‌లో 1400 మంది ఆడియెన్ ఉంటే, అందులో 900 మంది ఫోన్లు చేశారు .. నంబ‌రిచ్చేశాను క‌దా! అని అన్నాడు ష‌క‌ల‌క శంక‌ర్‌. ఫోన్ చేసి అన్న‌య్యా బంప‌ర్ హిట్ కొట్టావు.. పార్టీ చేస్కుంటున్నాం అన్నారు. అంత‌కుమించిన సంతోషం ఇంకేం ఉంటుంది. మాకంటే అభిమానులే ఆనందంగా ఉండ‌డం మా భాగ్యం అని అన్నాడు ష‌క‌ల‌క శంక‌ర్‌.

ఈనెల 29న శంభోశంక‌ర‌ రిలీజై విజ‌యం సాధించింద‌ని ఇదే ఉత్సాహంలో శ్రీ‌కాకుళం టు వైజాగ్‌, ఇత‌ర‌త్రా చోట్ల అదిరిపోయే ప్ర‌చారం చేస్తామ‌ని ప్ర‌క‌టించాడు. అన్న‌ట్టే శంక‌ర్ బృందం ప్ర‌స్తుతం శ్రీ‌కాకుళంలో ప‌ర్య‌టిస్తోంది. అక్క‌డ అభిమానుల‌కు ట‌చ్‌లోకి వెళ్లాడు శంక‌ర్‌. ఇలాంటి సినిమాలు ఆడాలి. నాలాంటి శంక‌ర్‌లు నిల‌వాలి. చాలా మంది క‌డుపులు నిండాలి. ద‌ర్శ‌కుడు శ్రీ‌ధ‌ర్‌, నేను మొగుడు పెళ్లాల్లా క‌లిసిపోయి ప‌ని చేశాం. పెళ్లాలే అస‌హ్యించుకునేలా క‌లిసి ప‌ని చేయాల్సొచ్చింది. .. అని అన్నాడు. అన్న‌ట్టు ఇదే వేదిక‌పై శంక‌ర్, శ్రీ‌ధ‌ర్‌ల‌కు పెళ్లి (స‌న్మానం) చేస్తూ పూల దండ వేయ‌డం విశేషం. అంత గొప్ప స్నేహం అని అంతా పొగిడేశారు.

User Comments