ఘ‌నంగా నితిన్ నిశ్చితార్థం

క‌థానాయ‌కుడి నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. షాలిని అనే అమ్మాయిని మ‌నువాడ‌బోతున్నాడు. ఈ జంట నిశ్చితార్థం శనివారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ప‌రిమిత సంఖ్య‌లో స‌న్నిహితులు, మిత్రులు, కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఈ వేడుక‌ని నిర్వ‌హించారు. లండ‌న్‌లో ఎంబీఏ చ‌దివింది షాలిని. అక్క‌డే ఉద్యోగం చేస్తున్న‌ట్టు స‌మాచారం. వీళ్లిద్ద‌రూ చాలా యేళ్లుగా ప్రేమ‌లో ఉన్నారు. పెద్ద‌ల ఆమోదం పొంది ఇద్ద‌రూ ఒక్క‌టి కాబోతున్నారు. ఏప్రిల్‌లో వీళ్ల వివాహం హైద‌రాబాద్‌లోనే జ‌ర‌గ‌బోతోంది. నితిన్ `జ‌యం` సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ త‌ర్వాత వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకున్నారు. తెలుగులో దాదాపుగా అగ్ర ద‌ర్శ‌కులంద‌రితోనూ సినిమాలు చేశారు నితిన్‌. మ‌ధ్యలో వ‌రుస‌గా ప‌ద‌హారు సినిమాల‌కి పైగ ప‌రాజ‌యం చ‌విచూసినా… ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా పోరాటం చేసి మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టాడు. `ఇష్క్‌` సినిమా నుంచి ఆయ‌న కెరీర్ మ‌లుపుతిరిగింది.