నితిన్ ఇష్క్ ఆమెతోనే..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్స్ లో నితిన్ కూడా ఒక‌డు. 30 ఏళ్లు పైబ‌డినా ఇప్ప‌టికీ పెళ్లి మీద ధ్యాస వెళ్ల‌లేదు ఈ హీరోకు. ఇప్ప‌టికీ కెరీర్ ముఖ్యం.. పెళ్లి త‌ర్వాత అంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ హీరో ప్రేమ‌లో ఉన్నాడ‌ని తెలుస్తోంది.

ఇన్నేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నా నితిన్ పై ఎప్పుడూ పెద్ద‌గా రూమ‌ర్లు వినిపించ‌లేదు. బుద్ధిమంతుడిగానే ఇన్నాళ్ళూ ఉన్నాడు నితిన్. అయితే ఇప్పుడు ఈ హీరోను ఓ హీరోయిన్ ప్రేమ‌లో ప‌డేసింద‌నే వార్త‌లు ఇండ‌స్ట్రీలో బాగానే వినిపిస్తున్నాయి.

ఆ ముద్దుగుమ్మ మ‌రెవ‌రో కాదు.. లై ఫేమ్ మేఘాఆకాశ్. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఇప్పుడు కుచ్ కుచ్ హోతా హై అనేది ఇండ‌స్ట్రీ టాక్. పైగా మ‌నోడు కూడా మేఘాకు బాగా క‌నెక్ట్ అయిపోయాడు.

సాధార‌ణంగా ఓ సినిమా ఫ్లాపైతే ఆ కాంబినేష‌న్ ను రిపీట్ చేయ‌డానికి హీరోలు ఇష్ట‌ప‌డ‌రు. కానీ లై అంత పెద్ద డిజాస్ట‌ర్ అయినా కూడా వెంట‌నే మ‌రో అవ‌కాశం ఇచ్చాడు ఈ భామ‌కు. ప్ర‌స్తుతం ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ నిర్మాత‌లుగా కృష్ణ‌చైత‌న్య తెర‌కెక్కిస్తోన్న సినిమాలో నితిన్ కు జోడీగా మేఘానే న‌టిస్తుంది.

ఈ జోడీకి ఆన్ స్క్రీన్ పై కూడా మంచి మార్కులే ప‌డ్డాయి. దాంతో మ‌రోసారి ఆ భామ‌తోనే రొమాన్స్ చేస్తున్నాడు నితిన్. ఇదిలా ఉంటే ఇప్పుడు నితిన్ ల‌వ్ మ్యాట‌ర్ మాత్రం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ ఇద్ద‌రూ ప‌బ్లిక్ లోనూ బాగానే క‌నిపిస్తున్నారు.

వ‌ర‌స‌గా రెండు చిత్రాలు చేసినంత మాత్రానా ల‌వ‌ర్స్ అయిపోతారా అనే ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నా.. వీళ్ల వ్య‌వ‌హారం మాత్రం క‌చ్చితంగా తేడాగా అనిపిస్తుందంటున్నారు నితిన్ స‌న్నిహితులు. మేఘాలలో తేలిపోతున్న నితిన్.. ఎప్పుడు భూమ్మీద‌కు వ‌స్తాడో మరి..?

Follow US