పీఏ ఓవ‌రాక్ష‌న్‌తో హీరోకి బ్యాడ్‌నేమ్‌

టాలీవుడ్‌లో అన‌తి కాలంలోనే బాక్సాఫీస్ బంగారు కొండ‌గా పాపుల‌ర‌య్యాడు ఆ యువ‌హీరో. వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూకుడుమీదున్నాడు. ఇప్పుడున్న బెస్ట్ స్టార్ ఎవ‌రు? అంటే యూత్ ముక్త కంఠంతో ఆ హీరో పేరు చెబుతారు. టాలీవుడ్ 85 ఏళ్ల హిస్ట‌రీలో ఏ హీరోకి అంత వేగంగా అంత గొప్ప పేరు రాలేదు. సిల్వ‌ర్ స్పూన్ హీరోల‌కు సైతం చెమ‌ట‌లు ప‌ట్టించేంత పాపులారిటీ అత‌డిది. న‌టించిన నాలుగైదు సినిమాల‌తోనే ఆకాశ‌మే హ‌ద్దుగా ఎదిగేశాడు. అంతా బాగానే ఉంది కానీ, ఎంత సిల్వ‌ర్ స్పూన్, గోల్డెన్ స్పూన్ హీరో అయినా ఇక్క‌డ‌ ఒదిగి ఉండ‌డం చూస్తున్న‌దే. ఒక‌సారి తిరోగ‌మ‌ణం మొద‌లైతే అస్స‌లు ప‌ట్టించుకోని ప‌రిశ్ర‌మ ఇది. అందుకే ఒదిగి ఉండ‌డం ఇంపార్టెంట్ ఇక్క‌డ‌. లేదంటే ప‌రిశ్ర‌మ‌లో అనూహ్య ప‌రిణామాల‌తో తిప్ప‌లు త‌ప్ప‌వు.

అయితే స‌ద‌రు హీరో వ్య‌క్తిత్వ ప‌రంగా ఏ స‌మ‌స్యా లేదు కానీ, త‌న చుట్టూ ఉండే కోట‌రీ మాత్రం అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారి అత‌డి జెంటిల్‌మేన్ నేమ్‌ని చెడ‌గొట్ట‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది. స‌ద‌రు హీరోకి అస‌లు త‌న చుట్టూ ఏం జ‌రుగుతోందో కూడా తెలుసుకోలేనంత ధైన్యం క‌నిపిస్తోంది. త‌న‌ని ఏదైనా విష‌య‌మై ఎవ‌రైనా క‌ల‌వాల‌ని వ‌స్తే మ‌ధ్య‌లోనే ఆ పీఏ ఆపేస్తాడు. ఏదైనా బిజినెస్ ప‌ర్స‌స్‌లోనో లేక ఇంకేదైనా ప్రాజెక్టు గురించో వివ‌రించాల‌ని త‌న‌ని సంప్ర‌దిస్తే స‌ద‌రు పీఏ దానికి స‌రిగా రెస్పాండ్ కాడు. స‌రైన అప్రోచ్ అత‌డి నుంచి ఉండ‌దు. అయితే అత‌గాడు అలా చేయ‌డానికి కూడా ఓ స్ట్రాట‌జీ ఉంద‌ని అనుభ‌వ పూర్వ‌కంగా అంద‌రికీ తెలుస్తోంద‌ట‌. పైకం చేతిలో ప‌డ‌నిదే, మాట్లాడే బిజినెస్‌లో త‌న‌కు ప‌ర్సంటేజీ ముట్ట‌జెప్ప‌నిదే అత‌డు అస్స‌లు ముందుకే క‌ద‌ల‌నివ్వ‌డని స‌ద‌రు పీఏ గురించి తెలిసిన స‌న్నిహితులు చెబుతుండ‌డం షాకిస్తోంది. మొత్తం మీద ఈ పీఏ వ్య‌వ‌హారం కానీ, త‌న‌చుట్టూ ఉండే కోట‌రీ వాల‌కం కానీ ఏమాత్రం స‌రికాద‌న్న విమ‌ర్శ‌లు సీరియ‌స్‌గా ఫిలింస‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఈ విష‌యాల్ని స‌ద‌రు హీరో గ‌మ‌నించి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దితేనే త‌న ఇమేజ్‌కి ఏ మ‌చ్చా రాకుండా కాపాడుకోవ‌డం సాధ్య‌మ‌వుతుంది. కానీ స‌ద‌రు హీరో వ‌రుస సినిమాల‌తో బిజీలో ప‌డిపోయి పాపం వీటిని ప‌ట్టించుకునే స‌న్నివేశంలో లేడ‌ట‌. ఇదే యాటిట్యూడ్ కొన‌సాగితే మునుముందు ముప్పు తిప్ప‌లు త‌ప్ప‌వ‌న్న గుస‌గుస‌లు న‌డుస్తున్నాయ్‌! ప్చ్!!

User Comments