రాజ‌శేఖ‌ర్ కూతురు డెబ్యూ క‌ష్టాలు

Last Updated on by

ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్‌లో రూపొందిస్తున్న చిత్రం `2 స్టేట్స్‌`. చేత‌న్ భ‌గ‌త్ రాసిన న‌వ‌ల `2 స్టేట్స్‌` ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడ‌విశేషు, శివానీ రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్నారు. వెంక‌ట్ రెడ్డి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ (స‌త్తిబాబు) నిర్మాత‌. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ మధ్యలో క‌థ విష‌యంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మ‌ధ్య వివాదం బ్రేక్ కి కార‌ణ‌మైంది.  ఆ తరువాత 2స్టేట్స్ మూవీ ప్రాజెక్ట్ లో అసలేమి జ‌రిగింది అనే విషయమై దర్శకుడు వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌యత్నం చేసాడు.

ముంబై లోని బాలాజీ టెలి ఫిలిమ్స్ లో దర్శకత్వ కోర్స్ పూర్తి చేసిన త‌ర్వా స్టార్ దర్శకులు వి.వి. వినాయక్ గారి దగ్గర అసిస్టెంట్ గా, పలు చిత్రాలకు పనిచేసాను. ఇప్పుడు 2 స్టేట్స్ తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నా. అంద‌రి స‌హ‌కారంతో 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది, ఆ విష‌యంలో అంతా హ్యాపీగా ఉన్నారు. కానీ సినిమా బాగా వస్తున్న టైంలో నా కథను కొంతమంది పక్కదోవ పట్టించే దిశగా కథలో మార్పులు చేయమని నన్ను నిర్మాత అడిగారు. దానికి నేను తిరస్కరించాను. అయితే కొంతమంది తో కలిసి నిర్మాత ఎం.ఎల్.వి. సత్యనారాయణ నన్ను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించాలని న్యూస్ పేపర్స్ లో .. సోషల్ మీడియాలలో నాపై చేసిన అసత్య ప్రచారం చేస్తున్నారు. అందుకు నిర్మాత పై కోర్ట్ లో కేసు వెయ్యడం జరిగింది. దీంతో సివిల్ కోర్టు ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ (స‌త్తిబాబు) ని వివరణ కోరింది. 2స్టేట్స్ సినిమాకు నేను కూడా పార్ట‌న‌ర్ ని. ఈ చిత్ర హక్కులు .. 2స్టేట్స్ రిమేక్ రైట్స్ ముంబాయి లో చేసిన అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా పూర్తిగా దర్శకత్వం వహించే హక్కులు నాకు మాత్రమే ఉన్నాయి. నేను కాకుండా ఎవరైనా ఈ చిత్రాన్ని మిగతా 30% షూటింగ్ పూర్తి చేయాలని వచ్చిన దర్శకుడు పై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. అంతేకాదు 2స్టేట్స్ మూవీ కథ మార్పులు చేసి నన్ను ప్రాజెక్ట్ నుండి దూరం చేయాలనుకున్న అందరి పేర్లు మరియు మరికొన్ని విషయాలు కోర్టు వారితో సంప్రదించి త్వరలో బయట పెడతాను, అని దర్శకుడు వెంకటరెడ్డి ఆగ్ర‌హం చెందారు.