భారీ యాక్సిడెంట్.. హీరో రాజ‌శేఖ‌ర్ ఎస్కేప్

Rajasekhar

న‌టుడు రాజ‌శేఖ‌ర్ కారు ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం రామోజీ ఫిలింసిటీ నుంచి షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా పెద్ద గోల్కొండ అప్పా జంక్ష‌న్ వ‌ద్ద కారు ప్ర‌మాదానికి గురై మూడు ప‌ల్టీలు కొట్టింది. వెంట‌నే కారులో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవ‌డంతో ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. కారు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘ‌ట‌న‌పై రాజ‌శేఖ‌ర్ స్పందించారు.

ఆ స‌మ‌యంలో కారులో ఒక్క‌డినే ఉన్నాను. ప్ర‌మాదానికి గురైన వెంట‌నే ఎదురుగా మ‌రో కారులో వ‌స్తోన్న ఉన్న ప్ర‌మాదాన్ని గుర్తించి స్పందించారు. విండ్ షీల్డ్ లోంచి బ‌య‌ట‌కు లాగారు. ఎలాంటి గాయాలు కాలేదు. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాను. అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌కు విష‌యాన్ని చెప్పాను. దేవుని ద‌య వ‌ల్ల త‌న‌కు ఎలాంటి గాయాలు కాలేద‌ని తెలిపారు. గ‌తంలోనూ ఓసారి రాజ‌శేఖ‌ర్ కారు పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే పై డివైడ‌ర్ ను డీకొట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో చిన్న చిన్ని గాయాల‌తో బ‌య‌ట ప‌డ్డారు. ఆ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రో యాక్సిడెంట్. దీంతో ఆయ‌న అభిమానుల్లో ఆందోళ‌న నెల‌కొంది.