రామ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్‌.. రీజ‌న్‌?

Last Updated on by

ఎన‌ర్జిటిక్ గ‌య్ రామ్ కెరీర్ గ‌త కొంత‌కాలంగా డోలాయ‌మానంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే అత‌డి కెరీర్‌ని స‌క్సెస్ ట్రాక్‌లోకి తెచ్చేందుకు సీరియ‌స్‌గా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. రామ్ పెద‌నాన్న స్ర‌వంతి ర‌వికిషోర్ ఈ విష‌యంలో చాలా చాలా సీరియ‌స్‌గానే ఉన్నారు. ఆ క్ర‌మంలోనే కొడుకు కోసం ఓ పెద్ద క‌థ‌ల బ్యాంక్‌ని ఆయ‌న త‌యారు చేస్తున్నారు. త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన క‌థ‌ల్లో మెరిక‌ల్లాంటివి కొనేసి వెంట‌నే లాక్ చేసేస్తున్నారు. ఇటీవ‌లే జాతీయ అవార్డు సినిమా తీసిన ప్ర‌వీణ్ స‌త్తారు చెప్పిన క‌థ న‌చ్చింది. ఆ క‌థపై చ‌ర్చ‌లు సాగించి స్క్రిప్టును పూర్తి స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఏకంగా కొన్ని నెల‌ల‌పాటు ర‌చ‌యిత‌ల‌తో కూర్చుని సీరియ‌స్‌గా క‌స‌ర‌త్తు చేశారు.

ప్ర‌వీణ్ స‌త్తారుతో ర‌చ‌యిత‌ల బృందం క‌థా చ‌ర్చ‌లు సాగించింది. కేవ‌లం క‌థ కోస‌మే 2కోట్లు ఖ‌ర్చు చేశారుట‌. కొడుకుని ఎట్టి ప‌రిస్థితిలో స‌క్సెస్ దారిలోకి తేవ‌డ‌మే ధ్యేయంగా రాజీలేని క‌స‌ర‌త్తు చేశార‌ట‌. అయితే చివ‌రి నిమిషంలో బ‌డ్జెట్ తెచ్చిన తంటాతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింద‌ని తెలుస్తోంది. ప్ర‌వీణ్ స‌త్తారు ఏకంగా భారీ బ‌డ్జెట్ చెప్ప‌డంతో రామ్ మార్కెట్ అంత లేద‌ని స్ర‌వంతి డ్రాప్ అయిపోయార‌ట‌. దాదాపు 40కోట్లు ఖ‌ర్చు చేయాల్సిన యాక్ష‌న్ క‌థాంశాన్ని ప్ర‌వీణ్ స‌త్తారు స్ర‌వంతికి చెప్పార‌ట‌. ఆల్మోస్ట్ రామ్ మార్కెట్‌కి డ‌బుల్ బ‌డ్జెట్ చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ మ‌ధ్య‌లోనే డ్రాప్ అయ్యార‌ని ప్ర‌చారం సాగుతోంది. రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు తెర‌కెక్కించిన `గ‌రుడ‌వేగ` స‌క్సెసైనా కాస్ట్ ఫెయిల్యూర్ అన్న టాక్ వ‌చ్చింది. ఇక‌పోతే ప్ర‌వీణ్ స‌త్తారు మ‌రోసారి రాజ‌శేఖ‌ర్‌తోనే సినిమా తీసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని, మ‌రో అగ్ర హీరోకి క‌థ వినిపించే ప‌నిలో ప‌డ్డార‌ని తెలుస్తోంది. రామ్ ప్ర‌స్తుతం త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో `హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

User Comments