రానాకి కంటి ఆప‌రేష‌న్‌

Last Updated on by

బాహుబ‌లి చిత్రంలో భ‌ళ్లాల దేవ‌గా మ‌న‌సు దోచాడు రానా. ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా బిజీబిజీగా ఉన్నాడు. హాథీ మేరీ సాథీ బ‌హుభాషా చిత్రంలో న‌టిస్తూనే, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావ్ బ‌యోపిక్‌కి స‌న్నాహాలు చేస్తున్నాడు. వేరొక పీరియ‌డ్ డ్రామాలోనూ న‌టిస్తున్న రానా.. వ‌రుస‌గా ప్రాజెక్టుల‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు.

స‌రిగ్గా ఇలాంటి వేళ రానాకి సంబంధించిన ఓ సీక్రెట్‌పై టాలీవుడ్‌లో విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది. రానాకి చిన్న‌ప్ప‌టి నుంచి ఒక క‌న్ను క‌నిపించ‌దు. కొన్నేళ్ల క్రితం హైద‌రాబాద్ మ్యాక్సివిజ‌న్‌లో కుడికంటికి శ‌స్త్ర‌చికిత్స చేయించాడు. డా.స‌తీష్‌ గుప్తా అత‌డి కంటికి ఆప‌రేష‌న్ చేశారు. అయితే ఈసారి విదేశాల్లో కంటి ఆప‌రేష‌న్ చేయించుకునేందుకు.. శాశ్వ‌త ప‌రిష్కారం కోసం రానా ఏర్పాట్లు చేసుకున్నాడుట‌. ఈపాటికే ఈ శ‌స్త్ర‌చికిత్స పూర్త‌వ్వాల్సింది. కానీ అత‌డికి ఉన్న హై-బీపీ వ‌ల్ల వాయిదా వేశార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం రానా రాక కోసం విదేశీ కంటి ఆప‌రేష‌న్ నిపుణులు వేచి చూస్తున్నారు. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ఈ శస్త్ర చికిత్స పూర్తి చేస్తార‌ని తెలుస్తోంది.

User Comments