సునీల్ గోల్‌మాల్ ప్లాన్

Last Updated on by

క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారాడు సునీల్‌. అటుపై డ‌జ‌ను సినిమాల కెరీర్‌లో కేవ‌లం మూడు నాలుగు హిట్లు మాత్ర‌మే ద‌క్కాయి. మ‌ర్యాద‌రామ‌న్న‌, అందాల రాముడు మిన‌హా పెద్ద రేంజు విజ‌యాలేవీ ద‌క్క‌లేదు. దాంతో అత‌డి కెరీర్ కాల‌క్ర‌మంలో డోలాయ‌మానంలో ప‌డింది. హీరోగా రాణించాలంటే త‌నకు స్టామినా స‌రిపోవ‌డం లేదు. అంత గొప్ప క‌మెడియ‌న్‌ని చూసిన జ‌నం.. అత‌డిలో కామెడీ హీరోని చూడ‌లేక‌పోతున్నారు. అందుకే ఇటీవ‌లి కాలంలో సునీల్ న‌టించిన సినిమాల‌న్నీ తిర‌స్కారానికి గుర‌య్యాయి. ఇక ప‌నిలో ప‌నిగా బాన పొట్ట‌.. న‌వ్వు తెప్పించే రూపాన్ని పూర్తిగా ట్రిమ్ చేసి ఎంత పెద్ద త‌ప్పు చేశాడో సునీల్‌కే ప్రాక్టిక‌ల్‌గా అర్థ‌మైంది. సాటి న‌టుడు, అనుభ‌వ‌జ్ఞుడు కోటా శ్రీ‌నివాస‌రావు నాడు త‌న‌ని ఎందుకు తిట్టాడో అర్థం కావ‌డానికి సునీల్‌కి పెద్దంత టైమ్ ప‌ట్ట‌లేదు. అయితే హీరో అవ్వ‌డం అన్న క‌ల‌ని నిజం చేసుకుని, ఏలుకున్న‌న్నాళ్లు ఏలుకున్నాను! అన్న సంతృప్తి మాత్రం సునీల్‌కి ఉంద‌న‌డంలో సందేహం లేదు. తాను వ‌ద్దులే అనుకుంటే త‌ప్ప త‌న‌కు హీరోగా అవ‌కాశాలిచ్చేవాళ్ల‌కు కొద‌వేం లేదు. అయితే ఫ్లాపుల‌తోనే ఎన్నాళ్ల‌ని బండి న‌డిపించ‌గ‌ల‌డు? అందుకే ఇప్పుడు ప్లాన్ మార్చాడు. ప్లాన్ -బిని అమ‌ల్లో పెడుతున్నాడు.

మ‌ల్టీస్టార‌ర‌ర్ అన్న ఆలోచ‌నే ప్లాన్ బి! ఇప్ప‌టికిప్పుడు సునీల్ వ‌ర‌స‌గా నాలుగైదు మల్టీస్టార‌ర్ల‌కు సంత‌కాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే అల్ల‌రి న‌రేష్‌తో, శ‌ర్వానంద్‌తో మ‌ల్టీస్టార‌ర్లు చేస్తున్నాడు. న‌రేష్‌తో భీమ‌నేని సినిమాలో త‌న పాత్ర హైలైట్‌గా ఉంటుందిట‌. సుడిగాడు 2గా చెబుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ వేగంగా సాగుతోంది. ఈలోగానే శ‌ర్వానంద్ – హ‌నురాఘ‌వ‌పూడి చిత్రంలో సునీల్ వేరొక కీల‌క‌పాత్ర పోషించేందుకు సంత‌కం చేశాడు. నేటినుంచి సునీల్ యూనిట్‌తో జాయిన్ అవుతున్నాడు. ఇక‌పోతే మెగాస్టార్ సైరాలో కీల‌క‌పాత్ర పోషించేందుకు సునీల్ ఓకే చెప్పాడ‌ని ప్ర‌చార‌మైంది. ఇక గ‌తంలోకి వెళితే నాగ‌చైత‌న్య‌తో త‌డాఖాలో సునీల్ న‌టించిన సంగి తెలిసిందే. ఇక‌పోతే ఇప్పుడున్న యువ‌హీరోల‌తో క‌లిసి సునీల్ మ‌ల్టీస్టార‌ర్ల‌కు ప‌చ్చ జెండా ఊప‌డం ఫిలింవ‌ర్గాల్లో చ‌ర్చకొచ్చింది. సునీల్ ఒక‌వేళ డిజాస్ట‌ర్ల హీరో అన్న ముద్ర త‌న‌కే ఎందుకని భావించి ఇలా చేస్తున్నాడా? అంటూ మాట్లాడుకుంటున్నారంతా. ప్లానింగ్ బాగుంది సునీల్ భ‌య్యా!!

User Comments