నంద గోపాలకృష్ణ బిగ్ డే

Last Updated on by

సూర్య అన‌గానే గ‌జిని, సింగం సిరీస్ గుర్తుకొస్తాయి. త‌మిళ్‌, తెలుగులో సూర్య స్టార్‌డ‌మ్‌ని అసాధార‌ణంగా పెంచిన చిత్రాలివి. ఇటీవ‌ల కొన్ని ప‌రాజ‌యాలు సూర్య‌కు ఇబ్బందిగా మారినా, అత‌డిపై అభిమానుల‌కు ఏమాత్రం గురి త‌గ్గ‌లేదంటే ఈ సినిమాల పుణ్య‌మే. అందుకే ప్ర‌స్తుతం అత‌డు న‌టిస్తున్న ఎన్‌జీకే రిలీజ్‌కి వ‌స్తోంది అన‌గానే ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. నిన్న‌టిరోజున ఎన్‌జీకే సెకండ్ లుక్ రిలీజైంది. ఎన్‌జీకే అంటే నంద గోపాల‌కృష్ణ అన్న సంగ‌తిని రివీల్ చేశారు. సెకండ్‌లుక్‌కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. సూర్య విప్ల‌వ విద్యార్థిగా ఈ చిత్రంలో న‌టిస్తున్నాడు. అందుకు త‌గ్గ‌ట్టే గ‌డ్డం పెంచి ర‌ఫ్‌గా క‌నిపిస్తున్నాడు. క‌ళ్ల‌తోనే కోసేసే చెగువేరా స్ఫూర్తితో అత‌డి తొలి లుక్‌ని లాంచ్ చేసిన‌ప్పుడే ఈసారి ఏదో కొత్త‌గా ట్రై చేస్తున్నార‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. సెకండ్ లుక్‌తో మ‌రింత‌గా క్లారిటీ వ‌చ్చింది.

ఎన్జీకేతో సూర్య పూర్వ వైభ‌వాన్ని తిరిగి తెస్తాడ‌నే అంచ‌నా వేస్తున్నారు. మాస్‌లో మాస్సివ్ హిట్ కొట్టేలా సెల్వ‌రాఘ‌వ‌న్ ఎంతో నేర్పుతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడ‌న్న స‌మాచారం ఉంది. సూర్య‌కు, సెల్వ‌కు ఇది ఎంతో ఇంపార్టెంట్ సినిమా కాబ‌ట్టి ఆ జాగ్ర‌త్త తీసుకుంటున్నారుట‌. హీరో అంత‌కుమించి మాన‌వ‌త‌, మంచి ఉన్న హీరోగా అత‌డి గురించి అభిమానులు సూర్య గురించి చెబుతుంటారు. హ్యాట్సాఫ్ టు హిమ్‌. నేడు సూర్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మైఫ‌స్ట్ షో త‌ర‌పున ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు.

User Comments