యంగ్ స్టార్ హీరో కాళ్ళు, చేతులు నరికేస్తాం

కోలీవుడ్ యంగ్ స్టార్ హీరోల్లో ఒకడిగా ఉంటూనే, అక్కడి సినీ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేస్తోన్న విశాల్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ తో కూడా మంచి అనుబంధమే కలిగి ఉన్న విశాల్ అక్కడ నడిగర్ సంఘంలో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తానని అధికారికంలోకి వచ్చిన విషయం కూడా అందరికీ తెలుసు. అయితే, అప్పటి నుంచి విశాల్ ప్రక్షాళన మొదలుపెట్టి దూకుడు చూపిస్తుండటంతో.. రియల్ లైఫ్ లో ఈ హీరోకి చాలామంది విలన్ లు తయారవుతున్నారు. ఈ క్రమంలో ఓసారి విశాల్ కు చంపేస్తాం అంటూ బెదిరింపులు కూడా వచ్చాయట.

ఇక ఇప్పుడేమో ఏకంగా కాళ్ళు చేతులు నరికేస్తాం అంటూ విశాల్ వాట్సాప్ కు వార్నింగ్ ఇస్తూ మెసేజ్ లు వస్తున్నాయని తెలియడం హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఉన్నట్టుండి తాజాగా తీవ్ర స్థాయిలో  కొందరు బెదిరింపులకు దిగడంతో విశాల్ తరపున ప్రముఖ నిర్మాతలు పోలీసులను సంప్రదించారు. ఈ మేరకు నిర్మాతలు మనిమ్మరన్, మహమ్మద్ సాహిల్ లు ఈ ఘటనపై చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిని సీరియస్ ఇష్యూగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, హీరో విశాల్ ఇటీవలే కర్ణాటక వెళ్లి కావేరి వివాదంపై కూడా ధైర్యంగా మాట్లాడిన విషయం తెలిసే ఉంటుంది. మొత్తంగా సినిమా హీరోగానే కాకుండా ఇలా పలు వివాదాల్లో చిక్కుకుంటూ.. పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పుడు విశాల్ తమిళనాట రియల్ హీరో అయిపోయాడంటే అతిశయోక్తి కాదేమో.

Follow US