రీల్ లైఫ్ లోనే..రియ‌ల్ లైఫ్ లో జీరోలు

యంగ్ హీరో నాగ‌శౌర్య కు హైద‌రాబాద్ పోలీసులు జ‌రిమానా విధించారు. నిబంధంన‌ల‌కు విరుద్దంగా వెల్ల‌డంతో ఫైన్ క‌ట్టాల్సి వ‌చ్చిందని తెలుస్తోంది. నాగ‌శౌర్య ప్ర‌యాణిస్తోన్న కారు అద్దాల‌కు న‌లుపు తెర‌లు ఉండ‌టంతో ట్రాఫిక్ పోలీసులు జ‌రిమానా విధించారు. బంజారా హిల్స్ రోడ్డు నంబ‌ర్ 1లో వాహ‌నాలు త‌నీఖిలు నిర్వ‌హిస్తోన్న స‌మ‌యంలో నాగ‌శౌర్య కారు ప‌ట్టుబ‌డింది. 13ఈజీ,1188 నంబంర్ వాహ‌నం అద్దాల‌కు న‌లుపు తెర ఉండ‌టాని పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై ర‌వి గుర్తించారు. కారు ఆపి నుల‌పు అద్దాలు తొల‌గించ‌డంతో పాటు 500 జ‌రిమానా విధించారు.

ఇటీవ‌లే రామ్ ప‌బ్లిక్ లో సిగ‌రెట్టు త్రాగినంద‌కు 300 ఫైన్ క‌ట్టాడు. అటుపై సంబంధాలు లేని కార‌ణాలు చెప్పాడు. టాలీవుడ్ సెల‌బ్రిటీలకు ఇలాంటి జరిమానాలు కొత్తే కాదు. గ‌తంలో చాలా మంది సెల‌బ్రిటీలు జ‌రిమానాలు చెల్లించారు. అయితే సినిమాల్లో నీతులు చెప్పే వాళ్లంతా నిజ జీవితంలో క‌నీసం ఒక్క శాతం కూడా పాటించ‌క‌పోవ‌డంపై నేటి జనులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. రీల్ లైఫ్ లో హీరోలు…రియ‌ల్ లైఫ్ లో జీరోలంటూ కామెంట్లు పెడుతున్నారు. మార్పు ముందు మ‌న‌తో ప్రారంభం అవ్వాలంటూ స‌ల‌హ‌లిస్తున్నారు.

Also Read : Exclusive : AA19 Title Revealed