క‌త్తి గుడ్డు ప‌గిలింది..

Last Updated on by

ఇన్నాళ్లూ మాట‌ల‌తోనే సాగిన య‌వ్వారం ఇప్పుడు సీరియ‌స్ అయ్యింది. అన్నట్లుగానే క‌త్తి మ‌హేశ్ పై దాడి జ‌రిగింది. అది ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్సే చేసార‌ని మ‌హేశ్ అంటున్నాడు కానీ అక్క‌డ చేసింది ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులే అనే ఆధారాలు కూడా లేవు. ఎందుకంటే సార్ అంద‌రి హీరోల ఫ్యాన్స్ కు మంచి మిత్రుడు క‌దా..! బ్రోక‌ర్లు.. ఎద‌వ‌లు అంటూ హీరోలంద‌ర్నీ చాలా అద్భుత‌మైన మాట‌ల‌తో సంభోదిస్తుంటారు క‌దా..! అందుకే ఏ హీరో అభిమానులు ఈయ‌న‌కు గుడ్డు అభిషేకం చేసారో తెలియ‌దు. కానీ నాలుగు నెల‌లుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నే ప‌ట్టుకున్న క‌త్తి మ‌హేశ్ మాత్రం త‌న‌పై దాడి చేసింది ప‌వ‌న్ అభిమానులే అంటున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ ట్వీట్ వేస్తే చాలు.. కానీ ఇప్పుడు దాడి జ‌రిగిన త‌ర్వాత ప‌వ‌న్ వ‌చ్చి త‌న‌కు సారీ చెప్పాల్సిందే అంటున్నాడు. ఇన్నాళ్లూ ఈయ‌న ఏం చేసినా కులం మ‌ధ్య‌లోకి రాలేదు. కానీ ఇప్పుడు ద‌ళిత సంఘాలు కూడా మ‌హేశ్ క‌త్తికి స‌పోర్ట్ గా బ‌య‌ల్దేరాయి. మీరేం చేసినా.. మిమ్మల్ని కాపాడుకోడానికి మేమున్నాం అంటూ బ‌య‌ర్దేరుతున్నారు. ఇప్పుడు సార్ పై దాడి జ‌రిగినందుకు ఏకంగా ఓయు విధ్యార్థుల‌నే తీసుకొస్తున్నారు. ఎందుకంటే అభిమానులు అభిమానం ముసుగులో త‌ప్పుచేస్తే త‌ప్పు.. కానీ ఈయ‌న మాత్రం త‌న‌పై దాడి జ‌రిగినందుకు యూనివ‌ర్సిటి విధ్యార్థుల‌కు కులం రొచ్చు అంటించి వెన‌కాల తిప్పించుకోవ‌చ్చు. అభిమానులు చేస్తే అన్యాయం.. సార్ చేస్తే మాత్రం న్యాయం. ఎందుకంటే ఆయ‌న‌కు వాక్ స్వాతంత్ర్యం ఉంది క‌దా..!

ప‌వ‌న్ ను బ్రోక‌ర్ అంటాడు.. ఏబ్రాసీ అంటాడు.. ఎద‌వ అంటాడు. ఇన్ని అన్నా స‌ర్ ను మాత్రం చాలా గౌర‌వంగా చూసుకోవాలి.. అభిమానులకు అస్స‌లు కోపం రాకూడ‌దు. ఈయ‌నకు మాత్ర‌మే ఈ స‌మాజంలో బ‌తికే హ‌క్కుంది.. ఏ హీరోనైనా తిట్టే హ‌క్కుంది. చివ‌రికి బాల‌య్య లాంటి స్టార్ ను కూడా ఇలాంటి రొటీన్ సినిమాలు చేయ‌డం కంటే ఖాళీగా ఉండ‌టం బెట‌ర్ క‌దా అనే మాట‌లు కూడా అనేస్తుంటాడు. అయినా కానీ ఈయ‌న్నేం అన‌కూడ‌దు. ఎందుకంటే వాక్ స్వాతంత్య్రం ఉంది క‌దా..! పైగా సార్ గారికి మ‌ళ్లీ ప్ర‌త్యేకంగా ఓ ఛానెల్ కూడా ఉంది క‌దా కాపాడుకోడానికి. ఆయ‌న‌పై ఈగ వాలినా కూడా అక్క‌డ క‌ప్పు కాఫీ రెడీగా ఉంటుంది.. డిస్క‌ష‌న్ కు ఫోన్ లైన్ లో వేలాది మంది సార్ గారి కోసం వేచి చూస్తుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ ఫ్యాన్స్ మాత్ర‌మే క‌త్తిపై క‌క్ష్య క‌ట్టారేమో అనుకున్నారు. కానీ మొన్న బాల‌య్య ఫ్యాన్స్ కూడా క‌త్తి క‌నిపిస్తే ప‌గులుతుంద‌ని ఘాటుగానే స్పందించారు. మ‌రిప్పుడు ఆయ‌న‌పై ప‌గిలిన గుడ్డు ఏ అభిమానుల నుంచి వ‌చ్చిందో..?

User Comments