శంషాబాద్‌లో బుక్క‌యిన హీరోయిన్‌!

Last Updated on by

తీగ లాగితే డొంకంతా క‌దిలిన చందంగా గ్లామ‌ర్ ప్ర‌పంచంలో ఇమేజ్ సంపాదించుకుని, అటుపై అమెరికా వెళ్లి డాల‌ర్ల‌లో సంపాదించేందుకు పావులు క‌దుపుతున్న హీరోయిన్లు అంతా చీక‌టి వ్య‌వ‌హారాల్లో అడ్డంగా దొరికిపోతున్న వైనం బ‌య‌ట‌ప‌డుతోంది. అమెరికాలో ఈవెంట్ మేనేజ‌ర్ల‌తో చేతులు క‌లిపి సెక్స్ రాకెట్ వ్య‌వ‌హారాల్లో చురుగ్గా ఉన్న ప‌లువురు క‌థానాయిక‌లు, యాంకర్ల గుట్టు మ‌ట్లు అమెరిక‌న్ పోలీసులు క‌నిపెట్టేయ‌డంతో కొంప కొల్లేరైపోతోంది.

ఇప్ప‌టికే ఐదుగురు క‌థానాయిక‌ల చిట్టా మొత్తం అమెరిక‌న్ ఫెడ‌ర‌ల్ పోలీస్ బ‌య‌ట‌పెట్టేందుకు రెడీ అవుతున్నార‌ని తెలిసింది. ఇప్ప‌టికే స‌ద‌రు నాయిక‌ల‌కు ఇమ్మిగ్రేష‌న్ అధికారులు వీసాలు ర‌ద్దు చేశారు. ఆస‌క్తిక‌రంగా ఈ బిగ్ స్కాండ‌ల్‌ రాకెట్ వ్య‌వ‌హారంలో వేరొక ఆస‌క్తిక‌ర సంగ‌తి బ‌య‌ట‌ప‌డింది. అమెరికా వెళ్లి ర‌క‌ర‌కాల దొడ్డి దారుల్లో సంపాదించుకున్న డాల‌ర్ల‌ను గంప‌గుత్త‌గా శంషాబాద్ విమానాశ్ర‌యంలో రూపాయ‌ల్లోకి మార్చుకున్న ఓ హీరోయిన్ బండారం బ‌ట్ట‌బ‌య‌లైంది. దాదాపు 14 ల‌క్ష‌ల మేర క్యాష్‌ని స‌ద‌రు నాయిక డాల‌ర్ల నుంచి రూపాయ‌ల్లోకి ఇక్క‌డే మార్చుకుందిట‌. అస‌లు ఓ సాధాసీదా హీరోయిన్‌కి అంత పెద్ద మొత్తం ఎలా వ‌చ్చింది? అంటూ పోలీసులు కూపీ లాగ‌డంతో ఎన్నో విష‌యాలు తెలిశాయిట‌. అమెరిక‌న్ ఫెడ‌ర‌ల్ పోలీస్‌కి మ‌న పోలీసులు ఇన్వెస్టిగేష‌న్ లో సాయం చేస్తుంటే ఇలాంటి క‌ళ్లు భైర్లు క‌మ్మే విష‌యాలే తెలుస్తున్నాయ‌ని స‌మాచారం.

User Comments