బ‌న్ని బ్యూటీ డూప్లెక్స్ ఓన‌ర్

Last Updated on by

టాలీవుడ్ క‌థానాయిక‌లు హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో సొంత ఇల్లు కొనుకుని ఇక్క‌డే సెటిలవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ జాబితాలో అనుష్క‌, స‌మంత వంటి తార‌లు ఉన్నారు. అలానే లావ‌ణ్య త్రిపాఠి, ర‌కుల్ ప్రీత్‌సింగ్, రాశీ ఖ‌న్నా ఇటీవ‌లే సొంతంగా అపార్ట్‌మెంట్లు కొనుక్కుని ఇక్క‌డే సెటిల‌య్యారు.

ఇప్పుడు ఈ వ‌రుస‌లో మ‌రో యువ‌క‌థానాయిక వ‌చ్చి చేరింది. అందాల క‌థానాయిక కేథ‌రిన్ హైద‌రాబాద్ ఔట్‌స్క‌ర్ట్స్‌లో ఓ ఖ‌రీదైన‌ డూప్లెక్స్ కొనుక్కుంద‌ని తెలుస్తోంది. కోకాపేట్ ప‌రిస‌రాల్లో ఈ డూప్లెక్స్ ఉందిట‌. త‌న క్లోజ్ ఫ్రెండ్ అయిన ఓ టాలీవుడ్ నిర్మాత ఈ డీల్ విష‌యంలో సాయం చేశార‌ని తెలుస్తోంది. బ‌న్ని స‌ర‌స‌న `ఇద్ద‌ర‌మ్మాయిలతో` చిత్రంలో న‌టించిన కేథ‌రిన్‌, ఇటీవ‌లే రానా స‌ర‌స‌న‌ `నేనేరాజు నేనే మంత్రి` చిత్రంలో న‌టించింది. ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించింది. ఆ త‌ర్వాత ఎందుక‌నో కేథ‌రిన్ థ్రెసా తెలుగు సినిమాల‌కు అంగీక‌రించ‌లేదు. ప్ర‌స్తుతం త‌మిళంలో సిద్ధార్థ్ సర‌స‌న ఓ క్రేజీ ప్రాజెక్టులో న‌టిస్తోంది. మునుముందు తెలుగు సినిమాల్లో న‌టించేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తోందిట‌. ఆ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌లో డూప్లెక్స్ కొనుక్కోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

User Comments