వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న హీరోయిన్

మ‌ల‌యాళ హీరోయిన్ మంజు వారియ‌ర్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని వ‌ర‌ద‌ల్లో చిక్కుకుంది. షూటింగ్ కోసం వెళ్లిన ఆమె చిత్ర‌బృందంతో క‌లిసి వ‌ర‌ద‌ల్లో చిక్కుకుంది. ఈ విష‌యాన్ని ఆమె సోద‌రిక‌డి ఫోన్ ద్వారా తెలిపింది. అదే విష‌యాన్ని విదేశాంగశాఖ స‌హాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. షూటింగ్ లో భాగంగా న‌టి మంజు స‌హా 30 మంది సిబ్బంది మ‌నాలికి వంద కిలోమీట‌ర్ల దూరంలోఉన్న చ‌త్ర‌కు వెళ్లారు. మూడు వారాలుగా వారు అక్క‌డే షూటింగ్ చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో అనూహ్యాంగా వ‌ర‌ద‌లు రావ‌డంతో చిక్కుకున్న్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని కేంద్ర మంత్రి ముఖ్య‌మంత్రి జైరామ్ ఠాకూరుకు వివ‌రించారు. వెంట‌నే సాహ‌య‌క సిబ్బందిని పంపిచి ఆ 30 మందిని కాపాడిన‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఔట్ డోర్ షూటింగ్ ల‌కు వెళ్లోద్ద‌ని అందుబాటులో ఉన్న లోకేష‌న్స్ ను వాడుకుని షూటింగ్ చేసుకోవాల‌ని సూచించారు. దేశంలో ప‌రిస్థితి బాగోన‌ప్పుడు షూటింగ్ కు ఎందుకు వెళ్లారని? ద‌యచేసి స‌మ‌స్య‌ల‌కు కొని తెచ్చుకోవ‌ద్ద‌ని తెలిపారు.