వ‌ర్మ స్పీడ్‌కి హైకోర్టు బ్రేక్

రామ్ గోపాల్ వర్మ తెర‌కెక్కించిన `అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు` రిలీజ్ డైల‌మా తెలిసిందే. ఈ చిత్రం విడుదల కు హైకోర్టు మరోసారి బ్రేక్ వేసింది. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం పిటీషన్  విచారించిన కోర్టు ఈ స‌మ‌స్య‌ను రివైజింగ్ క‌మిటీ- సెన్సార్ బృందం ప‌రిష్క‌రించాల‌ని కోరింది. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని చిత్ర యూనిట్ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అయితే దానిపై సెన్సార్ బోర్డ్ .. చిత్ర‌యూనిట్ మ‌ధ్య కౌంట‌ర్లు వినిపించాయి.

చిత్రం లో ఉన్న అభ్యంతరాలు అన్ని తీసేసామని ఆర్జీవీ బృందం అంటే.. అలా తీసి వేసినట్టు ఎక్కడ లేదని కేవలం మ్యుట్ లో ఉంచారని మాత్రమే కౌంటర్ లో పేర్కొన్నారని హైకోర్టు వెల్ల‌డించింది. మ్యూట్ లో ఉంచలేదని కొన్ని సన్నివేశాలను డిలీట్ కూడా చేసామని.. బోర్డు సూచనల మేరకు ఛానెల్స్ లోగోలను కూడా తొలగించామని కోర్ట్ కు తెలిపారు ఆర్జీవీ టీమ్. ఇక ఇందులో  మత పరమైన అంశాలతో పాటు,ఒక వర్గాన్ని కించపరిచే లా ఉందని, శాంతి భద్రత సమస్యలు తలెత్తే అవకాశం అప్రూల్ చేయలేమని  హైకోర్టుకు నివేదిక అందింది. దీంతో ఆర్జీవీ టీమ్ మళ్ళీ రివ్యూ కి ఇచ్చార‌ట‌.

రివ్యూ కమిటీ  ఇప్పటికే చిత్ర యూనిట్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చింద‌ని అడిషనల్ సోలిసిటర్ జనరల్ వెల్ల‌డించారు అభ్యంతరాలన్ని సవరించుకున్న నేపథ్యంలో ప్రస్తుత  పరిస్థితి ఏమిటి అంటూ హైకోర్టు ప్ర‌శ్నించింది. అయితే రివ్యూ కమిటీ ఇంకా రెండ‌సారి చిత్రాన్ని పరీశీలించలేదని సోలిసిటర్ జనరల్ వెల్ల‌డించింది. దానికి ప్ర‌తిగా రీవ్యూ కమిటీ చిత్రాన్ని చూసి నిర్ణయం తెలపాలని హైకోర్టు కోరింది. రివ్యూ కమిటీ పరిధిలో ఉందని ఇప్పుడు తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది. రివ్యూ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ పై నిర్ణయం తీసుకోవాలని… అన్ని సక్రమంగా ఉన్నట్లయితే ఆర్డర్ పాస్ చేయాలని రివ్యూ కమిటి కి హైకోర్టు ఆదేశించింది.