హిందూపురంలో బాల‌య్య‌కు అవ‌మానం!

Last Updated on by

తండ్రి జీవిత‌క‌థ‌ని వెండితెర‌పై ఆవిష్క‌రించాల‌ని `ఎన్టీఆర్‌` బ‌యోపిక్ పేరుతో బాల‌కృష్ణ‌ చేసిన ప్ర‌య‌త్నం విక‌టించిన విష‌యం తెలిసిందే. రెండు భాగాలుగా తీసిన బ‌యోపిక్ బాక్సాఫీస్ వైఫ‌ల్యంతో పాటు త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టింది. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న‌ మీడియా ముందుకు రాక‌పోవ‌డంపైనా జ‌నం మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి వేళ బాల‌య్య‌కు సొంత నియోజ‌క వ‌ర్గంలో ఘోర అవ‌మానం జ‌రిగ‌డం చ‌ర్చ‌కొచ్చింది. హిందూ పురం నియోజ‌క వ‌ర్గం నుంచి బాల‌య్య ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే గ‌త కొంత కాలంగా హిందూపురం ఎమ్మెల్యే అని చెప్పుకోవ‌డ‌మే కానీ ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు బాల‌య్య చేసింది ఏమీ లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

దీంతో బాల‌య్య‌పై గుర్రుగా వున్న హిందూపురం ప్ర‌జ‌లు అవ‌కాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నార‌ట‌. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంద‌ర్భంగా మ‌ర్చిపోతున్న త‌న‌ను మ‌ళ్లీ నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు గుర్తు చేయ‌డం కోసం బాల‌య్య ఇటీవ‌ల రెండు రోజుల పాటు హిందూప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు.బాల‌య్య‌పై ఆగ్ర‌హంతో ఊగిపోతున్న మ‌హిళ‌లు, సామాన్య జ‌నం ఒక్క‌సారిగా బాల‌కృష్ణ కాన్వాయ్‌కి అడ్డుత‌గిలి నానా హంగామా చేశారు. బాల‌య్య కారు దిగ‌గానే రౌండ‌ప్ చేసి ఇక్క‌డున్న చిన్నా పెద్దా, గొడ్డు గోదా నీళ్లు లేక అళ్లాడిపోతున్నామ‌ని, ఈ విష‌యం ప‌ట్ట‌ని మీరు హైద‌రాబాద్‌లో కులాసాగా కాలం గ‌డిపేస్తున్నార‌ని మండిప‌డ్డార‌ట‌. ఇప్ప‌టికైనా హిందూ పురంలో నీటి స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించాల‌ని బాల‌య్యను న‌డీరోడ్డుమీద నిల‌దీయ‌డం నిజంగా అవ‌మానం కాక మ‌రేంటి అంటున్నారు