పిసినారి ఇంట్లో డెవిల్‌

Last Updated on by

అన‌గ‌న‌గ ఒక పిసినారోడు. ఓ ఇల్లు కొనుక్కున్నాడు. క‌ట్ చేస్తే ఆ ఇంట్లో ఓ డెవిల్ నివాసం ఉంటోంది. అస‌లే పిసినారిగా మారి ఎంతో క‌ష్ట‌ప‌డి కొనుక్కున్న ఇల్లు వ‌దిలేస్తాడా? వ‌దిలేయ‌డా? తెలియాలంటే మా సినిమా చూడండి అంటున్నాడు హోమానంద్‌.

హోమానంద్, పావ‌ని జంట‌గా న‌టించిన చిత్రం `మిస్ట‌ర్ హోమానంద్`. జై రామ్ కుమార్ ద‌ర్శ‌కుడు. ఓం తీర్థం ఫిల్మ్ మేక‌ర్స్ సంస్థ‌ నిర్మించింది. ఈ నెల 29న సినిమా రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భ ంగా క‌థానాయ‌కుడు హోమానంద్ మాట్లాడుతూ “నాన్న‌గారి ప్రోత్సాహంతోనే సినిమాల్లో ప్ర‌వేశించాను. హీరోగా న‌టించే ఆస‌క్తి ఉందా? అని అడ‌గ‌డ‌మే గాకుండా, న‌టించ‌మ‌ని నాన్న ప్రోత్స‌హించారు. ఆ త‌ర్వాత స‌త్య ం యాది వ‌ద్ద న‌ట‌నలో శిక్ష‌ణ తీసుక‌న్నాను. ఇక సినిమా సంగ‌తేంటి? అని ప్ర‌శ్నిస్తే. క‌థానాయ‌కుడు చిన్న‌ప్పుడే తండ్రిని కోల్పోతాడు. త‌న‌కంటూ ఓ సొంత‌ ఇల్లు కొనాల‌నే కోరిక ఉంటుంది. దాని కోసం హీరో పిసినారిగా మారిపోతాడు. ఇల్లు కొన్న త‌ర్వాత అస‌లు ట్విస్టు ఎదుర‌వుతుంది. ఆ ఇంట్లో ఓ దెయ్య ం ఉంటుంది. అప్పుడు హీరో ఏం చేశాడ‌నేది తెర‌పైనే చూడాలి. ఒకే ఒక్క పాత్ర నుంచి వ‌చ్చే కామెడీ వినోదం పంచుతుంది. అంద‌రికీ న‌చ్చే హార‌ర్ కామెడీగా ఇది.. అని తెలిపారు.

న‌టుడిగా తొలి సినిమాతోనే ఈ రంగం గురించి చాలా విష‌యాలు నేర్చుకున్నాను. హోమానంద్ త‌ర‌వాత పెద్ద ప్రాజెక్టుల్లోనే అవ‌కాశం ద‌క్క‌నుంది. సుకుమార్‌, మారుతి వంటి మేటి ద‌ర్శ‌కుల‌ ప్రొడ‌క్ష‌న్స్‌లో హీరోగా న‌టించ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి అని తెలిపారు. నాన్న‌గారు కేశ‌వ తీర్థ‌ బెజ‌వాడ పోలీస్‌. అత‌డెవ‌రు, అరె సినిమాల్లో హీరోగా న‌టించారు. ఆయ‌న స‌హ‌కారంతోనే ఇది సాధ్య‌మైంది. నేను బి.బి.ఎ చ‌దివాక ల‌ఘుచిత్రాలు చేయాల‌నుకున్నాను. ఆ క్ర‌మంలోనే నాన్న‌గారి ప్రోత్సాహంతో హీరోని అయ్యాను అని తెలిపారు.

User Comments