బికినీ బ్రాండ్ అంబాసిడ‌ర్

Last Updated on by

ఈ మ‌ధ్య దిశాప‌టానికి బ‌ట్ట‌లు పూర్తిగా క‌రువైపోయిన‌ట్లున్నాయి. సినిమాలు లేవు క‌దా అందుకే క్యాస్టూమ్స్ కూడా కొనుక్కోలేని స్టేజ్ లో ఉంది. అందుకే సింపుల్ గా అన్నీ బికినీలు కొనేసి పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు దిశా తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. లేక‌పోతే మ‌రేంటి ఈ మ‌ధ్య ఎక్క‌డ క‌నిపించినా కూడా బికినీ ట్రీట్ త‌ప్ప మ‌రోటి లేదు. రెస్టారెంట్స్ లో కూడా స్విమ్మింగ్ పూల్ ద‌గ్గ‌ర బికినీల‌తో సంద‌డి చేస్తుంది దిశా ప‌టానీ. బాలీవుడ్ లో ఎలాగైనా స్టార్ అయిపోవాల‌ని చూస్తున్న ఈ బ్యూటీ.. త‌న‌దైన ఆఫ‌ర్ కోసం చూస్తుంది.

భాగీ 2 బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా కూడా ఆ సినిమాలో దిశాప‌టానీ చేసింది చిన్న‌పాత్రే. అప్ప‌ట్లో ధోనీలో సెకండ్ హీరోయిన్ గా న‌టించినా దిశ కెరీర్ ద‌శ‌దిశ లేకుండా పోయింది. ఇక‌ తెలుగులో అయితే ఈ భామ ఆన‌వాళ్లే క‌నిపించ‌డం లేదు. ఆ మ‌ధ్య జాకీచాన్ తో న‌టించిన కుంగ్ ఫూ యోగా సైతం ఫ్లాప్ అయింది. ఇదిలా ఉండ‌గానే.. హాట్ ఫోటోషూట్ల‌తో మ‌త్తెక్కిస్తుంది దిశాప‌టాని. ఈ మ‌ధ్యే ఓ రెస్టారెంట్ లో రిలాక్సింగ్ మోడ్ లో పోజిచ్చింది దిశా. అది కూడా బికినీలోనే. ఇక ఇప్పుడు ఇంట్లో డ్ర‌స్సులే లేన‌ట్లు మ‌రోసారి బికినీలోనే ద‌ర్శ‌న‌మిచ్చింది దిశా. మొత్తానికి దిశా దూకుడు చూస్తుంటే రాను రాను ఇంకెంత ర‌చ్చ చేస్తుందో ఊహించుకోడానికి కూడా క‌ష్ట‌మే.

User Comments