నెల‌కు 20ల‌క్ష‌లు కుమ్మేస్తున్న హాట్ యాంక‌ర్

గ్లామ‌ర్ అండ్ గ్లిజ్ ప్ర‌పంచంలో సంపాదించుకునేవాళ్ల‌కు సంపాదించుకున్నంత‌. ఒక‌సారి నేము ఫేము క‌లిసొస్తే చాలు.. ఇక ఓ వెలుగు వెలిగిపోతారిక్క‌డ‌. ఇండ‌స్ట్రీ టాప్ యాంక‌ర్లు ఒక్కో ఈవెంట్ కి ల‌క్ష‌ల్లో పారితోషికాలు అందుకుంటున్నారు. మిడ్ రేంజ్ యాంక‌ర్లు ఏతా వాతా 30-40 వేలు అందుకునే వాళ్ల‌ను.. మ‌రీ త‌క్కువ‌గా రూ.15-20 వేల వ‌ర‌కూ అందుకునే యాంక‌ర్ల‌కు కొద‌వేం లేదు. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో నిరంత‌రం జ‌రిగే సినిమా ఈవెంట్ల‌కు యాంక‌రింగ్ చేయ‌డం ద్వారా ఒక్కో ఈవెంట్ కి అంత పెద్ద మొత్తం ఆర్జిస్తున్నారంటే నెల‌కు ల‌క్ష‌ల్లోనే పారితోషికాలు గిట్టుబాటు అవుతున్నాయ‌నే దీన‌ర్థం.సీనియ‌ర్ల‌లో ఝాన్సీ, సుమ, అనసూయ‌, రేష్మి, శ్రీ‌ముఖి ఇలా కొన్ని పాపుల‌ర్ పేర్లు రెగ్యుల‌ర్ గా వినిపిస్తుంటాయి. వీళ్ల‌లో ఝాన్సీ పెద్ద తెర న‌ట‌న వైపే మొగ్గు చూపుతూ యాంక‌రింగ్ అడ‌పాద‌డ‌పా బండి లాగించేస్తున్నారు. సుమ నిరంత‌రం పెద్ద స్థాయి టీవీ షోలు.. టీవీ ప్రొడ‌క్ష‌న్ తో బిజీ. ఉద‌య‌భాను ఫేడ‌వుల్ అయిపోయి త్వ‌ర‌లో సంతోషం అవార్డ్స్ యాంక‌రింగుతో రీఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఇక మిత‌గా యాంక‌ర్ల క‌థ తెలిసిందే.

అయితే ఈ సీనియ‌ర్లు ఎవ‌రూ ఊహించ‌లేనంత సంపాదిస్తున్న వేరొక కుర్ర యాంక‌ర‌మ్మ సైలెంటుగా అంద‌రికీ చెక్ పెట్టేస్తూ అనూహ్యంగా దూసుకుపోతోంద‌ట‌. ఇటీవ‌ల కాలంలో ఏ ఈవెంట్ చూసినా ఈ హాట్ ఫ్రీల్యాన్స్ యాంక‌ర‌మ్మ‌ ద‌ర్శ‌న‌మిస్తోంది. ఆడియో ఫంక్ష‌న్లు.. ప్రీరిలీజ్ ఫంక్ష‌న్లు.. భారీ అవార్డుల కార్య‌క్ర‌మాలు.. వీటితో పాటు రెగ్యుల‌ర్ ప్రెస్ మీట్లు .. అలాగే టీవీ షోలు వేటినీ విడిచి పెట్ట‌కుండా ఈ అమ్మ‌డు భారీగానే ఆర్జిస్తోంద‌ని తెలిసింది. టాప్ రేంజ్ ఈవెంట్ల నుంచి మిడ్ రేంజ్ ఈవెంట్లు .. లీస్ట్ రేంజ్ ఈవెంట్లలోనూ ఈ అమ్మ‌డు క‌నిపిస్తోంది. ఎలాంటి భేష‌జం లేకుండా వ‌చ్చింది దండుకుని బ్యాంక్ ఖాతాలో వేసేస్తోంద‌ట‌. అయితే ఇలా వ‌చ్చింది ఒక‌టో తారీఖున లెక్కేసుకుంటే సుమారు రూ.15ల‌క్ష‌ల నుంచి రూ.20ల‌క్ష‌ల వ‌ర‌కూ తేల్తోంద‌ట‌.

అయితే ఇది అన్ని వేళ‌లా సాధ్యం కాదు. ఒక్కో సీజ‌న్ ని బ‌ట్టి మారుతూ ఉంటుంది. ఇటీవ‌ల టాలీవుడ్ ఎందుక‌నో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. వరుస‌గా ఈవెంట్లు హోరెత్తుతున్నాయి. వెబ్.. యూట్యూబ్.. బుల్లితెర‌.. పెద్ద తెర అనే తేడా లేకుండా ర‌క‌ర‌కాల ఈవెంట్లు జ‌రుగుతుండ‌డంతో వీటికి క‌మిట‌వుతూ అంత పెద్ద మొత్తం లాగేస్తోంద‌ట‌. క్యూట్ గా .. ముద్దుగా.. చిల్లింగ్ గా .. క‌వ్వింత‌గా ఉండే ఈ భామ‌ను చూసి ప‌రేషాన్ అవుతున్న మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌న‌ను మాత్ర‌మే పిలిచి అవ‌కాశం ఇచ్చేస్తుండ‌డంతో అమ్మ‌డి హ‌వా అలా సాగుతోంద‌న్న‌ది గుస‌గుస‌. సంపాదించేవాళ్ల‌ను చూసి ఏడ్వ‌డం ఎందుకు? ట‌్యాలెంటు ఉంటే స‌త్తా చాటాలి కానీ.. దొర‌కినంతా దోచుకో.. దోచినంతా దాచుకో! అన్న సూత్రాన్ని తూ.చ త‌ప్ప‌క పాటిస్తోంది ఈ బూటీ.