బిగ్ బాస్ త‌ర్వాత‌ పెళ్లి భాజాలే?

యాంక‌ర్ శ్రీముఖి పెళ్లికి వేళాయేనా? అంటే అవున‌నే అంటున్నాయి ఆమె స‌న్నిహిత వ‌ర్గాలు. బిగ్ బాస్ -3లో కంటెస్టెంట్ గా అవ‌కాశం రావ‌డంతో శ్రీముఖి షో లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొన్ని రోజులు గ‌డిచిపోయింది. విజేత రేసులోనూ ఉంది. అయితే షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఘ‌ట్టం ఏంటి? అంటే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోవ‌డ‌మేన ఆమె స‌న్నిహితుల ద్వారా తెలిసింది. ఇంట్లో త‌ల్లిదండ్రులు ఇచ్చిన గ‌డువు మ‌గియ‌డం…పెళ్లి చేసుకోవాల‌న్న ఒత్తిడి గ‌త ఏడాది గా ఉందిట‌.

ఇప్ప‌టికే పెళ్లి కొడుకుని వెతికే ప‌నిలో ప‌డ్డ‌ట్లు స‌మాచారం. అన్ని అనుకున్న‌ట్లు గ‌నుక జ‌రిగితే వ‌చ్చే ఏడాది పెళ్లి భాజాలు మ్రోగమ‌డ‌మే ఆల‌స్యమంటున్నారు. మ‌రి ఇందులో నిజ‌మెంత‌న్న‌ది కుటుంబ స‌భ్యులు ధృవీక‌రించాల్సింది ఉంది. ప్ర‌స్తుతం శ్రీముఖి యాంక‌ర్ కెరీర్ కు తిరుగులేదు. తారా జువ్వ‌లో దూసుకుపోతుంది. టీవీషోలు చేస్తూనే సినిమా ఈవెంట్లకు యాంక‌రింగ్ చేస్తోంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అంత‌కు మించి హాట్ భామ‌గా మంచి క్రేజ్ ఉంది. మ‌రి ఆ మెరుపులు ఇంకెన్నాళ్లు మెరిపిస్తుందో చూడాలి.