క్రికెట‌ర్‌తో హాట్‌గాళ్‌ పెళ్లి

Last Updated on by

గ‌త కొంత‌కాలంగా క్రికెట‌ర్ హార్థిక్ పాండ్య బాలీవుడ్ క‌థానాయిక ఎల్లీ అవ్‌రామ్‌తో ప్రేమాయ‌ణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ జంట దాగుడు మూత‌ల దాంప‌త్యంపై బాలీవుడ్ మీడియాలో ప‌లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ర‌క‌రకాల ఈవెంట్ల‌లో ప‌బ్లిగ్గానే ఈ ఇద్ద‌రూ దొరికిపోవ‌డంపై యూత్‌లో వాడి వేడిగా చ‌ర్చ సాగింది.
అయితే ఇక ఈ స‌హ‌జీవ‌నానికి ఫుల్‌స్టాప్ పెట్టేస్తూ పెళ్లిబంధంతో ఒక‌టి కానున్నార‌ని తెలుస్తోంది. హార్థిక్ ఇంగ్లండ్ టూర్ ముగించుకుని తిరిగి ఇండియా చేరుకోగానే ఈ జంట పెళ్లి జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. ఎల్లీకి మూడుముళ్ల బంధానికి టైమొచ్చేసిందంటూ ఒకటే ప్ర‌చారం సాగుతోంది. క్వీన్ త‌మిళ రీమేక్‌లో కాజ‌ల్ తో న‌టిస్తున్న ఎల్లీ అవ‌రామ్ పెళ్లాడుతుందా?  లేదా? అన్న‌ది కాజ‌ల్‌కి తెలిసే ఉండొచ్చు. కాజ‌ల్ కానీ, హార్థిక్ కానీ, ఎల్లీ కానీ ఎక్క‌డైనా దీనిపై లీకులిస్తారేమో చూడాలి.

User Comments