Last Updated on by
శ్రీరెడ్డి వ్యవహారం మర్చిపోక ముందే.. మరో ప్రకంపనం.. ఈసారి సినిమా ఈవెంట్ల మాటున సెక్స్ రాకెట్ సంచలనానికి కారణమైంది. విదేశీ ఈవెంట్ల వెనక అసలు భోగోతం లీక్ చేస్తూ అమెరికా- చికాగో పోలీసులు పెద్ద రాకెట్‌నే బట్టబయలు చేయడం పెను సంచలనమైంది. ఈ వ్యవహారంతో ఇంకా ఉందిలే అనుకున్న టాలీవుడ్ పరువు మర్యాద పూర్తిగా గంగలో కలిసిపోయింది. తాజాగా బయటపడిన సెక్స్ రాకెట్ స్కాండల్‌లో టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ అనే తేడా లేకుండా అన్ని పరిశ్రమల నుంచి కథానాయికల పేర్లు బయటకు లీకవుతుండడం సంచలనమైంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న తెలుగు కథానాయికలందరినీ దొరికిన వాళ్లను దొరికినట్టే అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారిస్తుండడం తో సన్నివేశం ఎంతో సీరియస్‌గా ఉందని అర్థమవుతోంది. ఇందులో నవతరం కథానాయిక మెహ్రీన్ ఫీర్జదా అడ్డంగా బుక్కయింది. తనను అరగంట పాటు అమెరికా పోలీసులు యక్షప్రశ్నలతో విచారించారు. అయితే తాను తన తల్లిదండ్రులను కలిసేందుకు అమెరికా వెళ్లానని చెప్పగానే పోలీసులు తనకు క్షమాపణ చెప్పారని, కిషన్- చంద్రకళ దంపతులు ఈవెంట్ల మాటున నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ గురించి తెలిసిందని మెహ్రీన్ వివరణ ఇచ్చింది.
కేవలం రెండు సినిమాలు తీసిన కిషన్ అనే నిర్మాత భార్య సహకారంతో అప్కమ్ నాయికల్ని వ్యభిచార వృత్తిలోకి దించుతున్న వ్యవహారాన్ని అమెరికా పోలీసులు కనిపెట్టి అరెస్టు చేయడంతో అసలు కథంతా బయటపడింది. ఇందులో ఇద్దరు తెలుగమ్మాయిలు, అలానే మరో బెంగళూరు కథానాయిక అంటూ పేర్లు బయటపెడుతున్నారు. ఇక దీనిపై పలువురు తెలుగు కథానాయికలు వివరణ ఇచ్చేందుకు చానెళ్ల లైవ్‌లకు వెళ్లారు. ఈ కేసును తవ్వే కొద్దీ ఎన్నో బయటకు తెలీని కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అవకాశాల కోసం వచ్చే కొత్తమ్మాయిల్ని మధ్యవర్తులు తెలివిగా ట్రాప్ వేసి పడుపు వృత్తిలోకి దించేస్తున్నారు. అటుపై రంగుల ప్రపంచంలో డాలర్లకు అలవాటు పడిన సదరు నటీమణులు లేదా కథానాయికలు ఆ వృత్తిని సైడ్ ఇన్‌కం కోసం కొనసాగిస్తున్నారని పరిశ్రమ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం తెలుగు కథానాయికలు ఎవరు కనిపించినా పోలీసులు విచారించడంపైనా ఉత్కంఠ నెలకొంది. దీనిపై అపూర్వ, అర్చన లాంటి నాయికలు వివరణ ఇచ్చారు. మనం బంగారం అయితే మనల్ని ఎవరూ టచ్ చేయరు. మనం లోకువ అయితే ఆడుకుంటారంటూ ఈ భామలు వివరణ ఇచ్చారు. డబ్బు కోసం కొందరు కక్కుర్తి పడ్డారని సెలవిచ్చారు. అయితే ఇందులో ఎవరికి వారు గుమ్మడికాయ దొంగల తీరుగా తమకు మాత్రం అలాంటి సమస్య ఎదురవ్వలేదని చెప్పుకోవడం మరో ట్విస్టు.అసలు అతడెవరో తెలియనే తెలీదు అంటూ నటి అపూర్వ వివరణ ఇచ్చారు. కిషన్ అనేవాడు కొత్తమ్మాయిల్ని ముగ్గులోకి దించుతాడని తనకు తెలుసని, తనకు ఆ సన్నివేశం ఎదురవ్వలేదని అపూర్వ స్కిప్ కొట్టారు. కథానాయిక సంజన మాట్లాడుతూ.. దిగువ స్థాయి నాయికలు డబ్బు కోసం ఇలాంటి పనులు చేస్తున్నారంటూ బరస్టవ్వడం వేరొక రకం ట్విస్టు. మొత్తానికి ఎవరికి వారు స్కిప్ గేమ్ ఆడుతూ .. వేరొకరి మీదికి నెట్టేయడంపైనా యూత్‌లో ప్రత్యేకంగా చర్చ సాగుతోంది.
User Comments