రేణు కామెంట్స్.. ప‌వ‌న్ ఫ్యూచ‌ర్..?

Last Updated on by

ఇన్నాళ్ళూ రేణుదేశాయ్ తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు విడిపోయాడు అంటే ఇద్ద‌రికి గొడ‌వ‌లు అయ్యాయి.. ఇద్ద‌రూ ప‌రస్ప‌ర ఒప్పందంతో దూరం అయ్యారు అని వార్త‌లు వ‌చ్చాయి. కొంద‌రు అయితే నిజం తెలుసుకోకుండా రేణుదేశాయ్ దే త‌ప్పు అని కూడా రాసారు. కానీ ఓపిక‌కు కూడా ఓ హ‌ద్దు ఉంటుంది. ఇప్పుడు రేణుదేశాయ్ కు అది పోయింది. అందుకే నిజాల‌న్నీ చెప్పేసింది. త‌ను విడాకులు తీసుకోడానికి కార‌ణం ప‌వన్ కళ్యాణ్ అని తేల్చేసింది ఈమె. దానికితోడు ప‌వ‌న్ పై ఇన్ డైరెక్ట్ గానే కొన్ని విమ‌ర్శ‌లు కూడా చేసింది. త‌న‌తో కాపురంలో ఉన్న‌పుడే మ‌రో అమ్మాయితో ఓ బిడ్డ‌ను క‌న్న ప‌వ‌న్ ను ఏమ‌నాలి అన్న‌ట్లు మాట్లాడింది. అయితే ఇన్నాళ్ళూ సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడాల్సి వ‌స్తుంది.. ఈమె త‌ను ఒక్క‌రే మాట్లాడుతున్నారా.. లేదంటే వెన‌క ఎవ‌రైనా ఉన్నారా..?

ప‌వ‌న్ ఇప్పుడు రాజ‌కీయంలో ఉన్నాడు. అత‌డి ఇమేజ్ ను దెబ్బ తీయ‌డానికి రేణుతో ఇలా మాట్లాడ‌టానికి ప్రేరేపిస్తున్నారా అనేది కూడా అనుమానమే. ఎందుకంటే ఏడేళ్లుగా ఒంట‌రిగా ఉంటూ డిప్రెష‌న్ లో ఉన్న రేణును క‌దిలిస్తే క‌చ్చితంగా కొన్ని విష‌యాలు బ‌య‌టికి వ‌స్తాయి. ఇది తెలుసుకుని కావాల‌నే రేణుదేశాయ్ ను కొంద‌రు ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్ చేసార‌ని అర్థ‌మైపోతుంది. ఇప్పుడు చేసిన ఇంట‌ర్వ్యూలో కూడా యాంక‌ర్ గుచ్చిగుచ్చి మ‌రీ రేణును ప‌ర్స‌న‌ల్ ప్ర‌శ్న‌లు అడిగింది. దాంతో రేణు కూడా ఓపెన్ అయిపోయింది. అయితే ఇప్పుడు జ‌రిగింది జ‌రిగిపోయింది కానీ ఈ వ్యాఖ్య‌లు ప‌వ‌న్ ఇమేజ్ ను ఎంత‌వ‌రకు దెబ్బ‌తీస్తాయి.. ఈయ‌న పొలిటిక‌ల్ కెరీర్ పై రేణుదేశాయ్ ప్ర‌భావం ఏంటి అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

User Comments