కుర్ర‌హీరోను వ‌ద‌ల‌ని ఆంటీ

Last Updated on by

బాలీవుడ్ లో బంధాల‌న్నీ ఇలాగే ఉంటాయి. అక్క‌డ వ‌య‌సుతో అస్స‌లు ప‌ని ఉండ‌దు. ప్రేమ‌కు వ‌య‌సుతో ప‌నిలేదు అని ఎవ‌రు చెప్పారో కానీ దీనికే ఫిక్సైపోయారు బాలీవుడ్ సెలెబ్రెటీస్. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. తాజాగా మ‌లైకా అరోరా ఇప్ప‌టికీ అర్జున్ క‌పూర్ వెంటే ప‌డుతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఎఫైర్ ఉంద‌ని బాలీవుడ్ మొత్తం కోడై కూస్తుంది కొన్నేళ్లుగా. అయితే కొన్ని రోజుల కింద ఈ ఇద్ద‌రూ విడి పోయార‌ని.. ఎవ‌రి దారి వాళ్లు చూసుకున్నార‌నే వార్త‌లున్నాయి. దానికితోడు శ్రీ‌దేవి మ‌ర‌ణం.. ఆ త‌ర్వాత సోన‌మ్ పెళ్ళి.. వీటితో అర్జున్ క‌పూర్ కు తీర‌క లేకుండా పోయింది. దానికి తోడు సినిమాలు కూడా ఉండ‌టంతో మ‌లైకాతో ఎక్క‌డా క‌నిపించ‌లేదు కూడా. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య నిజంగానే తెగిపోయింది అనుకున్నారంతా.

కానీ ఇప్పుడు అర్జున్ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ కు మ‌లైకా లైక్ కొట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక‌వేళ దూరంగా ఉంటే ఈ లైక్ ల‌కు అర్థం ఏంటి..? అర్జున్ దూరంగా ఉన్నా కూడా ఇప్ప‌టికీ మ‌లైకా మాత్రం ఈ కుర్ర హీరోను మ‌రిచిపోలేకపోతుందా..? ఏమో ఇప్పుడు ఈ ఆంటీ తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అన్న‌ట్లు అర్జున్ కంటే వ‌య‌సులో 15 ఏళ్లు పెద్దది మ‌లైకా. అయినా కూడా ఈ కుర్ర హీరో వెంటే ప‌డుతుంది ఈ ముదురు ముద్దుగుమ్మ‌. మ‌రి ఈ ప్రేమ్ క‌హానీ చివ‌రికి ఎటు వెళ్తుందో..!

User Comments