లేడీ నిర్మాత క్రికెటర్ పై మ‌న‌సు పడింది

Last Updated on by

ఏక్తాక‌పూర్ అంటే బాలీవుడ్ లో ఓ ఇమేజ్ ఉంది. సెక్స్ సినిమాలు చేసి డ‌బ్బులు సంపాదిస్తుంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నా.. ఇది ప్యాష‌న్ అంటుంది ఏక్తా. త‌న సినిమాలు ఇలాగే ఉంటాయి.. చూస్తే చూడండి లేక‌పోతే లేదు అని చెప్పేంత ధైర్యం కూడా ఈమె సొంతం. ఇక ఇప్పుడు ఈమె ఓ క్రికెట‌ర్ పై మ‌న‌సు ప‌డింది. ఎలాగూ పెళ్లి కాలేదు క‌దా.. కొంప‌దీసి ఆయ‌న్ని పెళ్లి చేసుకుంటుందేమో అని ఊహించుకోకండి. ఎందుకంటే ఈమె మ‌న‌సు ప‌డింది సినిమా చేయ‌డానికి. అవును.. ఇండియ‌న్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్.. ప్రిన్స్ ఆఫ్ కోల్ కతా సౌర‌వ్ గంగూలీపై బ‌యోపిక్ చేయ‌డానికి రెడీ అవుతుంది ఏక్తాక‌పూర్. ఈ సంద‌ర్భంగా అఫీషియ‌ల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది.

ఇప్ప‌టికే ఇండియ‌న్ క్రికెట‌ర్స్ పై మూడు బ‌యోపిక్ లు వ‌చ్చాయి. ధోనీ బ‌యోపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ కాగా.. స‌చిన్ బ‌యోపిక్ కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందాయి. ఇక అజార్ బ‌యోపిక్ డిజాస్ట‌ర్ అయిపోయింది. ఇప్పుడు గంగూలీ బ‌యోపిక్ రానుంది.  గంగూలీ జీవితంలో క్రికెట్ మాత్ర‌మే కాదు.. రొమాన్స్ కు కూడా కొద‌వేలేదు. న‌గ్మాతో ఈయ‌న న‌డిపిన ప్రేమాయ‌ణం అప్ప‌ట్లో సంచ‌ల‌నం. మ‌రి ఇప్పుడు ఇవ‌న్నీ బ‌యోపిక్ లో ఉంటాయా..? ఉంటే గంగూలీ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

User Comments