ఎన్టీఆర్ బ‌యోపిక్ లో హాట్ బ్యూటీ

Last Updated on by

ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే అన్న‌గారితో పాటు చాలా పాత్ర‌లు కావాలి. ఆయ‌న జీవితంలో ఎన్నో ముఖ్య‌మైన వ్య‌క్తులు ఉన్నారు. అంద‌రికంటే కీల‌కం ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తారకం. ఆమె లేకుండా ఎన్టీఆర్ బ‌యోపిక్ చేయ‌డం సాధ్యం కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఆ కారెక్ట‌ర్ కోసం ఎవ‌ర్ని తీసుకుంటున్నారో తెలుసా..? స‌్వ‌యానా బాలీవుడ్ నుంచి విద్యాబాల‌న్ ను తీసుకుంటున్నార‌ని తెలుస్తుంది. క్రిష్ రాయ‌బారంతోనే ఈ క్యారెక్ట‌ర్ కు విద్యాను టాలీవుడ్ కు తీసుకొస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇప్ప‌టికే బాలీవుడ్ లో క్రిష్ కు చాలా మంచి పేరుంది. అక్క‌డ మ‌నోడి క్రేజ్ తో స్టార్ హీరోయిన్ ను ఒప్పించాడ‌ని తెలుస్తుంది.

ఇక పాత్ర న‌చ్చి విద్యాబాల‌న్ కూడా ఒప్పుకుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో గౌత‌మీపుత్ర కోసం కూడా విద్యాబాల‌న్ ను అడిగారు కానీ అప్పుడు కుద‌ర్లేదు ఇప్పుడు కుదిరేలా ఉంది. సెప్టెంబ‌ర్ నుంచి అన్న‌గారి బ‌యోపిక్ ప‌ట్టాలెక్క‌బోతుంది. క్రిష్ ఈ చిత్రం కోసం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కూడా మొదలుపెట్టేసాడు. బాల‌య్య కూడా ఈయ‌న చెప్పిన కొన్ని మార్పులు చేయ‌డానికి ఒప్పుకున్నాడ‌ని తెలుస్తుంది. మొత్తానికి అటు క్రిష్.. ఇటు బాల‌య్య క‌లిసి ఎన్టీఆర్ బ‌యోపిక్ ను మ‌రో చ‌రిత్ర‌లా మార్చ‌డానికి చూస్తున్నారు. ఈ మ‌హాయ‌జ్ఞంలో విద్యాబాల‌న్ కూడా తోడైతే బాలీవుడ్ లోనూ ఎన్టీఆర్ సినిమాకు క్రేజ్ పెరుగుతుంది. చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..?

User Comments