బాల‌య్య స‌ర‌స‌న హాటీ

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌-బోయపాటి శ్రీను కాంబినేష‌న్ ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి సినిమా చేస్తున్న‌  సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే లాంఛ‌నంగా సినిమా ప్రారంభ‌మైంది. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ల‌నునున్నారు. ఇందులో బాల‌య్య‌కు జోడీగా ఇద్ద‌రి భామ‌ల్ని ఎంపిక చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆ భామ‌లిద్ద‌ర్ని ఎంపిక చేసిన‌ట్లు అన‌ధికారిక స‌మాచారం. ఇప్ప‌టికే బాల‌య్య స‌ర‌స‌న కీర్తి సురేష్ పేరు వినిపిస్తోంది. మ‌రో నాయిక ఎవ‌రో తెలియాల్సి ఉంఇ. అయితే ఇందులో బాల‌య్య స‌ర‌స‌న మ‌రో ముఖ్య‌మైన ఫీమేల్ ఫైరింగ్ రోల్ కూడా ఉంటుంద‌ని తాజాగా వినిపిస్తోంది. హాట్‌ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ ఆ పాత్ర‌కు ఎంపిక చేసుకుంటున్నారుట‌.

ఇటీవ‌లే బోయ‌పాటి ర‌ష్మీని క‌లిసి పాత్ర గురించి వివ‌రించి ఒప్పించిన‌ట్లు తెలుస్తోంది. ఈ పాత్ర‌ అమ్మ‌డిలో గ్లామ‌ర్ యాంగిల్ చిత్రానికి మ‌రింత‌ క్రేజ్ తీసుకొస్తుంద‌ని బోయ‌పాటి భావిస్తున్నాడుట‌. మ‌రి ర‌ష్మి పై ప్ర‌చారంలో నిజం ఎంత‌? అన్న‌ది అధికారికంగా తెలియాల్సి ఉంది. ర‌ష్మీ ఇప్ప‌టికే క‌థానాయిక‌గా క్రేజీ ఛాన్సుల కోసం ఎదురు చూస్తోంది. గుంటూరు టాకీస్ స‌హా ప‌లు సినిమాల‌తో త‌న‌ని తాను నిరూపించుకున్నా త‌న ఎన‌ర్జీ కి త‌గ్గ పాత్ర ఏదీ ల‌భించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో బాల‌య్య సినిమాలో ఛాన్స్ ర‌ష్మీకి క‌లిసొచ్చే అంశ‌మే. నిరూపించుకుంటే మ‌రిన్ని మంచి అవ‌కాశాలు త‌న‌ని వ‌రించే వీలుంటుంది.