సుర‌వ‌రం బిజినెస్ ఎంత?

యంగ్ హీరో నిఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `అర్జున్ సుర‌వ‌రం` న‌వంబ‌ర్ 29న విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. దీంతో నిఖిల్ బృందంలో హుషారు పెరిగింది. సాక్షాత్తు మెగాస్టారే ముఖ్య అతిధిగా రావ‌డ‌వంతో ప్ర‌చారం దూసుకెళ్లింది. అప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ప్ర‌చారం ఒక ఎత్తైతే..మెగాస్టార్ ఎంట్రీ మ‌రోమ లెవ‌ల్ కి తీసుకెళ్లింది.   ఇక టీజ‌ర్ తోనే ఇదొక ఇంటెన్స్ ఫిల్మ్ గా మౌత్ టాక్ ను ద‌క్కించుకుంది. వీట‌న్నింటి న‌డుమ సినిమాకు మంచి బిజినెస్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ 11 కోట్ల‌కు అమ్మ‌డు పోయిన‌ట్లు తెలుస్తోంది.  అన్ని ఏరియాల్లోనూ టాప్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీలు రిలీజ్ హ‌క్కులు ద‌క్కించుకున్న‌ట్లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో డిజిట‌ల్ స్ట్రీమింగ్, శాటిలైట్, డ‌బ్బింగ్ హ‌క్కులు చ‌క్క‌ని ధ‌ర‌ ప‌లికి ఉండొచ్చ‌ని అంచనా వేస్తున్నారు. నిర్మాత‌లు సేఫ్ జోన్ లోకి వెళ్లే ఛాన్సుంది. ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా త‌ర్వాత నిఖిల్ న‌టించిన కేశ‌వ‌, కిరాక్ పార్టీ చిత్రాలు రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ రెండిటికి న‌ష్టాలు త‌ప్ప‌లేదు. ఈ నేప‌థ్యంలో నిఖిల్ మార్కెట్ డ‌ల్ అయింద‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ `అర్జున్ సుర‌వరం` బిజినెస్ సంతృప్తికురంగా ఆశావ‌హంగానే క‌నిపిస్తోంద‌ట‌.