ప్లాప్ అయినా.. తగ్గని బ్రాండ్ వ్యాల్యూ 

పాపులర్ అయినప్పుడే బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు అవకాశాలు వస్తాయి.  తమ సంస్థకు పనిచేయమంటే తమకే పనిచేయమని.. విసిగిస్తుంటారు.  పేరున్న నటులు తమ ప్రోడక్ట్స్ కు ప్రచారం చేస్తే.. వ్యాల్యూ పెరుగుతుంది.. అమ్మకాలు బాగుంటాయి.  ఫలితంగా నాలుగు చేతులా సంపాదించవచ్చు.  అందుకే ప్రచారం కోసం స్టార్స్ ను వినియోగించుకుంటుంటారు.  ఎంత ఫేమస్ స్టార్ అయినా ఏదో ఒక సమయంలో ఆ ఇమేజ్ తగ్గిపోతుంది.  దీంతో క్రమంగా బ్రాండ్ వ్యాల్యూ పడిపోతుంది.  ఇది సహజమే. అయితే, గత కొంతకాలంగా హృతిక్ రోషన్ ప్లాప్ లతో అల్లాడుతున్నాడు.
ఒక్క సినిమా అయినా హిట్ అవ్వబోతుందా ఎలాగైనా తిరిగి ఇమేజ్ రాకపోతుందా అని ఎదురు చూస్తున్నాడు.  సినిమాల పరంగా ప్లాప్ అవుతున్నా.. బ్రాండ్ వ్యాల్యూ మాత్రం తగ్గలేదు.  ఇంకా పెరిగిందనే చెప్పాలి. ఇక తాజాగా హృతిక్ రోషన్ ను క్యూర్.ఫిట్ అనే సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.  క్యూర్.ఫిట్ అనేది ఒక ఫిట్నెస్ సంస్థ.  హృతిక్ రోషన్ తో ఫిట్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించి దానిని తమ ప్రచారం కోసం ఉపయోగించుకుంటుందట క్యూర్.ఫిట్.  ఇందుకోసం హృతిక్ కు ఏకంగా వంద కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకుంది. బాలీవుడ్ లో ఖాన్ త్రయం తరువాత హృతిక్ రోషన్ కు బ్రాండ్ ఇమేజ్ ఇక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.  అయితే, ప్లాప్ నుంచి కోలుకొని హిట్ బాట పడితే.. ఖాన్ లను మించిపోవడం ఖాయం అంటున్నారు బాలీవుడ్ జనాలు.